నాగార్జున సాగర్ ను సందర్శించిన.. తెలంగాణ రైసింగ్ గ్లోబ్ సమ్మిట్ డెలిగేట్స్

నాగార్జున సాగర్ ను సందర్శించిన.. తెలంగాణ రైసింగ్ గ్లోబ్ సమ్మిట్ డెలిగేట్స్

నల్లగొండ: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన  డెలిగేట్స్ ప్రముఖ పర్యాటక స్థలం  నాగార్జునాసాగర్ ప్రాజెక్టు, నాగార్జున కొండను సందర్శించారు. వివిధ దేశాలనుంచి వచ్చిన డెలిగేట్ల..  బౌద్ద సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బుద్ధవనాన్ని పరిశీలించారు. 

బుద్దవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య స్వయంగా డిలిగేట్స్ కుస్వాగతం పలికి అక్కడి చారిత్రక నేపథ్యం, పురావస్తు వివులు, బుద్ధవనం అభివృద్ది కార్యక్రమాలపై వివరాలు అందించారు. ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం ఆనవాళ్లు, శిల్పకళ వైభవం, పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్న అరుదైన శిల్పాలను డెలిగేట్లు ఆసక్తిగా వీక్షించారు.

►ALSO READ | Telangana Global Summit : హైదరాబాద్ పెట్టుబడులకు బెస్ట్ డెస్టినేషన్: గల్లా జయదేవ్

సాగర్‌ జలాశయంలో బోటులో  ప్రయాణించిన డెలిగేట్స్ ను ద్వీప ప్రాంతం నాగార్జున కొండ, పచ్చని సహజ వాతావరణం బాగా ఆకట్టుకున్నాయి.  తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక రంగాలలో ఉన్న అవకాశాలు విశేషమని తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

డెలిగేట్స్ పర్యటన సందర్బంగా పోలీసుల, పర్యాటక శాఖ అధికారులు భారీ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనతో నాగార్జునసాగర్ ప్రాంతం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.