తిరుమల గుడ్ న్యూస్ : భక్తుల దగ్గరకే ప్రసాదం.. కొండంతా వితరణ కేంద్రాలు

తిరుమల గుడ్ న్యూస్ : భక్తుల దగ్గరకే ప్రసాదం.. కొండంతా వితరణ కేంద్రాలు

ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు ఎంత ప్రశస్తి చెందిందో.. అన్న ప్రసాదాలకు కూడా అంతే పేరుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే కోట్లాది భక్తుల ఆకలి దప్పికలు తీరుస్తున్న శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం.. ఇక నుంచి భక్తుల దగ్గరకే ప్రసాదం తీసుకెళ్లాలని నిర్ణయించింది. కొండంతా భక్తులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ప్రసాదాన్ని పంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అన్న ప్రసాదాల తయారీకి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది.

ALSO READ | ఈ నెలలో.. ఈ 2 రోజులు తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

భక్తుల కోసం ఎంతో పవిత్రంగా వితరణ చేసే అన్నప్రసాదాలను ఎంతో శుద్ధిగా, హైజీనిక్ గా తయారు చేస్తున్నట్లు వీడియో విడుదల చేసింది టీటీడీ. వితరణలో భాగంగా అన్న ప్రసాదం, మజ్జిగ, పాలు అందిస్తున్న విషయం  తెలిసిందే. ఈ అన్న ప్రసాదాలను ఎంత స్వచ్ఛతతో తయారు చేస్తున్నారో వీడియోలో చూపిస్తూ టీటీడీ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ అన్న ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం..?

టీటీడీ ఎక్స్ లో ఓ వీడియోని షేర్ చేసింది. మీరు స్వామిని దర్శించే ముందు భక్తులకు ప్రేమతో సంప్రదాయంగా అందించే అన్నపూర్ణ దివ్య సేవను ఆస్వాదించండి అని రాసుకొచ్చింది. ఈ వీడియోను మంత్రి లోకేష్ షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. అన్నప్రసాదాల తయారీ గురించి భక్తులు కూడా ఈజీగా తెలుసుకుంటున్నారు. ఎంతో రుచికరంగా వేడివేడిగా ఉండే ఈ తిరుమల అన్న ప్రసాదంలో శుచి, శుభ్రత పాటిస్తూ తాజా కూరగాయలతో తయారు చేస్తారు.

టీటీడీ షేర్ చేసిన ఈ వీడియోలో మామిడి కాయతో పాటు వంకాయలు, బియ్యం ఎంతో శుచీ శుద్ధితో అన్నప్రసాదాన్ని ఆలయ సిబ్బంది పెద్ద ఎత్తున తయారు చేస్తుండటం ఈ వీడియోలో చూస్తాం. తయారు చేసిన అన్న ప్రసాదాన్ని క్యూ కాంప్లెక్స్ కి ఇతర ప్రాంతాల్లో భక్తులకు ఎలా అందిస్తున్నారు కూడా చూపించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన వారికి అక్కడ క్యూ కాంప్లెక్స్ లో కొన్ని గంటల కొద్దీ స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. దర్శనం ముందుగానే ఈ అన్న ప్రసాదను వితరణ చేస్తుంది టీటీడీ. ఎంత కావాలంటే అంత సులభంగా భక్తుల వద్దకే ఈ ప్రసాదం చేరుతుంది. అక్కడ శ్రీవారి సేవకుల ద్వారా పాలు, నీళ్ళ పాటు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.