క్వారంటైన్​ మూడు రోజులే 

క్వారంటైన్​ మూడు రోజులే 

న్యూఢిల్లీ: ఇంగ్లండ్​ టూర్​కు బయలుదేరనున్న  ఇండియా మెన్స్​, విమెన్స్​ క్రికెట్​ టీమ్​లకు గుడ్​న్యూస్.  ఇండియా జట్లు మూడు రోజులు మాత్రమే క్వారంటైన్‌లో ఉండేందుకు ఇంగ్లండ్​ క్రికెట్​ బోర్డు (ఈసీబీ)  ఓకే చెప్పింది. ఈ మేరకు కరోనా ప్రొటోకాల్స్​ను  సడలించింది. మొత్తానికి బీసీసీఐ చేసిన మంత్రాంగం ఫలించడంతో క్రికెటర్లకు 10 రోజుల హార్డ్​ క్వారంటైన్​ గండం తప్పింది. ఫలితంగా లండన్​లో దిగిన నాలుగో రోజు నుంచే ఇండియన్​ టీమ్​లు ప్రాక్టీస్​ను మొదలుపెట్టనున్నాయి.  జూన్​ 2న చార్టెడ్​ ఫ్లైట్స్​లో యూకే బయలుదేరనున్న రెండు జట్లలో.. విరాట్​సేన డైరెక్ట్​గా సౌతాంప్టన్ వెళ్తుంది. ఏజెస్​ బౌల్​  గ్రౌండ్​లో ఉన్న హోటల్లో మూడు రోజులు క్వారంటైన్​లో ఉంటుంది. ఇక విమెన్స్​ టీమ్​.. బ్రిస్టల్​కు వెళ్తుంది. అక్కడ జూన్​ 16 నుంచి ఇంగ్లండ్​ విమెన్స్​ టీమ్​తో ఏకైక టెస్ట్​ మ్యాచ్​ ఆడుతుంది. ఇక ఇవే రూల్స్​ను క్రికెటర్ల ఫ్యామిలీకి కూడా వర్తింపజేయాలని బీసీసీఐ.. యూకే గవర్నమెంట్​ అథారిటీస్​ను కోరింది. అయితే ప్లేయర్ల వరకు పర్మిషన్​ ఇచ్చిన అథారిటీస్​.. ఫ్యామిలీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై  ఇండియన్​ బోర్డు ఇంకా సంప్రదింపులు చేస్తోంది. ప్రస్తుతం క్రికెటర్లతో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్​ కూడా ముంబైలోని బబుల్​లోఉన్నారు.  ఇక షెడ్యూల్ విషయానికొస్తే.. జూన్​ 18– 22 వరకు న్యూజిలాండ్​తో జరిగే వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్ అనంతరం. ఆగస్టులో మొదలయ్యే సిరీస్​లో ఇండియా, ఇంగ్లండ్​తో  ఐదు టెస్ట్​ మ్యాచ్​లు ఆడుతుంది. 

నేడు టీమ్​ బబుల్లోకి ప్రసిధ్‌

ఇంగ్లండ్‌ టూర్‌కు స్టాండ్​ బై బౌలర్‌గా ఎంపికైన పేసర్‌  ప్రసిధ్ కృష్ణ.. నేడు మిగిలిన జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్‌-14లో భాగంగా కరోనా బారిన పడిన ప్రసిధ్‌ ఇటీవల రికవర్‌ అయ్యాడు. దీంతో ఆదివారం బెంగళూరు నుంచి బయలుదేరి ముంబైలో  ఉన్న టీమ్​ బబుల్లోకి వెళ్లనున్నాడు. ‘ప్రసిధ్​ కంప్లీట్​గా రికవర్​ అయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఇంట్లో ఉన్నాడు. ఆదివారం ముంబై బయలుదేరుతాడు. అక్కడి నుంచి టీమిండియా బబుల్లోకి వెళ్తాడు’ అని క్రికెటర్‌కు చెందిన వర్గాలు తెలిపాయి.