ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి..

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024- 25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.  ఈ కాలేజీల్లో చేరేందుకు ఎంట్రెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంది. టెస్ట్ కు ఏప్రిల్ 12 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 21 హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  ప్రవేశ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.

మరిన్ని వివరాలు పరిశీలిస్తే..

అప్లికేషన్ కు చివరి తేదీ : ఏప్రిల్ 12

హాల్ టికెట్ డౌన్ లోడ్ తేదీ : ఏప్రిల్ 21 నుండి

ప్రశ్నాపత్రం : ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగా  

మొత్తం మార్కులు : 150

పాస్ మార్కులు : 50 శాతం
 
వెబ్ సైట్ : https://tswreis.ac.in/