
తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్(Meetha Raghunath)..ఈమె ఎవరనేది యువతకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002లో ‘సా నీ నిధూమ్’ అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మీతా..కుర్రాళ్ళ మనసుని దోచేసింది. తన లుక్స్తో ఎంతో మందిని మెస్మరైజ్ చేసింది.
ఆమె కొన్ని సినిమాలే చేసినప్పటికీ..తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్గా వచ్చిన ‘గుడ్ నైట్’(Good Night) మూవీలో అమాయకురాలి పాత్రను పోషించి..మంచి గుర్తింపు తెచ్చుకుంది. మీతా రఘునాథ్ను ఆరాధించిన కుర్రాళ్ల గుండెల్లో బాధను నింపేసింది.
మీతా రఘునాథ్ తన పెళ్లి వార్తను ప్రకటించింది. ఆమె నిశ్చితార్థం ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీతా.. తన కాబోయే భర్తతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా..కొంతమంది ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కొంతమంది బాదైతే వర్ణనాతీతంగా మారింది. అయితే నిశ్చితార్థం ఫొటో షేర్ చేసింది కానీ, కాబోయే భర్త వివరాలతో పాటు పెళ్లి తేదీని సైతం ఆమె ప్రకటించాల్సి ఉంది.
ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. అయితే.. వరుస ఆఫర్లు వస్తున్న తరుణంలో ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించడంతో యూత్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కాబోయే అమ్మాయి అంటే ఇలా ఉండాలి..ఏం చేస్తాం..ఏం చేయలేము కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.