Good Health : మంచి నిద్రతోనే అందం.. ఆరోగ్యం.. తక్కువ నిద్రపోతే అందం కూడా తగ్గిపోతుంది..!

Good Health : మంచి నిద్రతోనే అందం.. ఆరోగ్యం.. తక్కువ నిద్రపోతే అందం కూడా తగ్గిపోతుంది..!

నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.  రీనాకి రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే రింగ్ అయిన క్షణంలోనే ఫోన్ ఎత్తుతుంది. ఇంకా నిద్రపోలేదా అని అడిగితే?  నిద్ర పట్టడం లేదంటుంది . ఏమైనా బాధలున్నాయా? అంటే.. ముఖం మీద పింపుల్స్ బాగా పెరిగిపోతున్నాయి. వీటిని ఎట్లా ఆపాలో అర్థం కాక, ఆలోచిస్తున్నానంటుంది. ఇలా నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే అనేక సమస్యలు వస్తాయి.   జుట్టు రాలడం.. హార్మోన్ల సమస్యలు.. ఇలా ఒకటేమిటి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 రీనానే కాదు జుట్టు రాలిపోతుందని కనకారావు... చర్మం ముడతలు పడి అందం వాడిపోతోందని... ఏం చేస్తే ఈ బాధలు తీరతాయని చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు. ఎన్ని చేసినా సమస్యలు పోవడం లేదని మనాదితో నిద్రపోకుండా పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు నిద్రే పరిష్కారమని... నిద్ర కూడా యాంటీ ఆక్సిడెంటని వాళ్లకు తెలియదు. ఈ నిజం తెలుసుకోలేనంత కాలం నిద్రలేని రాత్రులే మిగులుతాయి. ఆ బాధలు ఎప్పటికీ తీరవు. తీరాలంటే నిద్రపోవాల్సిందే..

శరీరంలో అవయవాల పనితీరుని ప్రభావితం చేసే హార్మోను ఒక కణం నుంచి మరోకణానికి రసాయన సంకేతాలను అందజేస్తాయి. ఆ సంకేతాలకు తగ్గట్టుగా మన బాడీ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రవర్తనే నిద్ర రావడం. నిద్రను రప్పించేది మెలటోనిన్ హార్మోన్. దీని వల్లే రోజూ ఒకే టైమ్ కు పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు అదే సమయానికి నిద్రవస్తుంది. సమయానికి మేల్కొనడం కూడా మెలటోనిన్ ప్రేరణే అంటే ఇది మన నిద్రకు స్విచ్ లాంటి దన్నమాట.

నిద్ర కూడా యాంటీ ఆక్సిడెంట్

నిద్రని వాయిదా వేయడం... అలారం పెట్టుకుని అవసరం అనుకున్నప్పుడు లేవడం, శరీరానికి కావాల్సినంత నిద్ర పోకపోవడంవల్ల పీనియల్ గ్రంది బాడీకి కావాల్సినంత మెలటోనిన్ ఉత్స త్తి చేయడు. అప్పుడు జీవ గడియారం దారి తప్పుతుంది. మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది...

మెలటోనిన్ నిద్రను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నిద్రరాకపోతే మెలటోనిన్ సప్లిమెంట్లు కొద్ది రోజుల పాటు చేసుకుంటే సమస్య పోతుందనుకుంటారు. మెలటోనిన్ సర్కేడియన్ రిథమ్ నిర్వహించడమే కాదు యాంటీ ఆక్సిడెంట్ గానూ పనిచేస్తుంది. బాగా పని ఒత్తిడితో ఉన్న వాళ్లు అసహనం, చిరాకుతో ఉంటారు. ఇలా ఉండటానికి కారణం అప్పుడు బాడీలో కొన్ని ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ విడుదలవడమే. వాటి ప్రభావమే అన్ ఈజీనెస్ .  ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ప్రవర్తనపైనే కాకుండా బాడీపై కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. 

ప్రీ ఆక్సిజన్ రాడికల్స్ కణాల్లో డీఎన్ ఏ ని డ్యామేజ్ చేస్తాయి. ఇలా జరిగితే అవయవాలు, కండరాలు పనితీరు నెమ్మదిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజ్ లు వస్తాయి. ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ విడుద లను మెలటోనిన్ కంట్రోల్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ క్యాన్సర్​ ని కంట్రోల్ చేసేందుకు కూడా ఈ మెలటోనిన్ ఉపయోగపడుతుంది.

నిద్రలేకుంటే?..

నిద్రసరిగా పోకపోతే కార్టిసోల్ లెవెల్స్ (ఒత్తిడి స్థాయిలు) పెరుగుతాయి. అందువల్ల నిద్ర సరిగా పోనివాళ్లు మతిమరుపు, చిరాకుతో పాటు నీరసంగా ఉంటారు. ఆకలి తగ్గిపోతుంది. సాధారణంగా పగలు పనిచేయాల్సి ఉంటుంది. ఈసమయంలో కార్టిసాల్ స్థాయి పెరగడంతో తొందరగా అలసిపోతారు. తక్కువ నిద్రపోవడం, అసలే నిద్రపోకపోవడం వల్ల కాలేయం పనితీరు కూడా మందగిస్తుంది.

నిద్రే బలం..

మెలటోనిన్​ విడుదలయితే నిద్ర వస్తుంది. నిద్రపోతే మెలటోనిన్ ఉత్పత్తి సరిగా ఉంటుంది. ఈ రిథమ్ కరెక్ట్​ గా  కంటిన్యూ అవుతూ ఉంటే మెలటోనిన్ తోపాటు కార్టిసాల్ హార్మోన్ కూడా వరెక్ట్ గా రిలీజ్ అవుతుంది. ఎడ్రినల్ గ్రంథి నుంచి కార్టిసాల్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే కండరాలు బలహీనమవుతాయి. కండరాల బలం తగ్గడంతో అవయవాల పనితీరు కూడా సరిగా ఉండదు. కండరాల బల్లం తగ్గడం వల్ల ముసలితనంలో డయాబెటిస్, బీపీ రావడం సహజం. అయితే కార్టిసోల్ హర్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల యువతీ యువకుల్లో కూడా కండరాళ్లు బలహీనం అవుతాయి. దయా బెటిస్ ను దూరంగా ఉండాలంటే కచ్చితమైన సమయంలో సరిపడ నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. 

రోజుకు ఎన్ని గంటల నిద్రపోవాలి?

 ఈ ప్రశ్న అందరికీ ఉండేదు. పెద్దవాళ్లు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని డాక్టర్స్ చెబుతారు. కానీ, ఎవరెంత సేపు నిద్రపోవాలో కచ్చితంగా చెప్పలేం. వయసు, చేసే పని, తీసుకునే తినే ఫుడ్ పరిసరాలు నిద్రపోయే టైమ్ ఫిక్స్ చేస్తాయి. ఈ విషయంలో లెక్కలే సుకోకుండా నిద్రపోయిన తర్వాత అలారంతో బలవంతంగా శరీరాన్ని నిద్రలేపకుండా ఎప్పుడు మెలకువ వస్తే అంటే మెలటోనిన్ ఎప్పుడు లేపితే అప్పుడు లేవడం మంచిది.

అందం పోతుందా?

మంచి ఫుడ్ తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, లైఫ్ స్టైల్ వల్ల చాలా రకాల రోగాలు వస్తున్నాయని తెలుసు. రోగాలతో ఉండే ఇబ్బంది వల్ల రోజువారీ పనులు చక్కబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టర్​ ను కన్సల్ట్​ చేస్తారు. సమస్య తీవ్రంగా లేనప్పుడు శరీరంలో వచ్చే మార్పున్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్నదే అయినా పెద్దగా ఫీలయ్యే సమస్యలు కొన్ని ఉంటాయి. జుట్టు రాలడం, బట్టతల, చర్మం ముడతలుపడటం, సిగ్మెంటేషన్ లాంటి అందాన్ని డ్యామేజ్ చేసే లక్షణం ఏది కనిపించినా  ఎక్కువుగా ఇమాజిస్​ చేసుకుంటారు. 

ఎక్కువగా ఫీలవడమే కాకుండా అంతే ఎక్కువగా రియాక్ట్ కూడా అవుతారు. చర్మంపై వచ్చే మార్పుల్ని శరీరంలో జరిగే మార్పులుగా అర్థం చేసుకోకుండా అందానికి వచ్చిన సమస్యగా చూస్తారు. అలా చూసినంత సేపు క్రీములు, షాంపూలు, సప్లిమెంట్స్ చుట్టూ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ సమస్యలకు కారణమైన మెలటోనిన్ లోపాన్ని గుర్తించాలి. 

ఈ హార్మోన్ తగ్గడానికి కారణం నిద్ర తగ్గిపోవడమే.. నిద్రపుచ్చే హార్మోన్​ ను  నిద్రలేపితే ఆరోగ్యమే కాదు అందమూ సొంతమవుతుంది. అనుమానం ఉంటే నిద్రపోని ముఖాన్ని అద్దంలో చూసుకోండి. నిద్రపోయిన తర్వాత  ముఖాన్ని కూడా అద్దంలో చూసుకొని పోల్చుకోండి. నిద్రకు అందానికి ఉన్న సంబంధం. అందానికి ఆరోగ్యానికి ఉన్న అనుబంధం అర్థం అవుతుంది

పాలతో పరిష్కారం

నిద్రరావట్లేదని ఎదురుచూడకుండా గ్రాసుడు పాలు తాగితే చాలు...  నిద్ర తన్నుకుని వస్తుంది. పాలలో ఉండే ట్రెప్టోఫాన్ మెలటోనిన్​ గా మారి నిద్రను రప్పిస్తుందని సైంటిస్టులు గుర్తించారు. గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపడుతుందని మనవాళ్లు ఎప్పుడో చెప్పారు... పాటిస్తున్నారు కూడా. సప్లిమెంట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ పాలు తాగితే ఏ సైడ్..ఎఫెక్ట్ ఉండదు. హెల్త్కి  మంచిది కూడా..

మంచి నిద్రే మేలు 

నిద్రపోతున్నప్పుడు మెలటోనిన్​  ఉత్పత్తి అవుతుంది. కాని   అన్నిసార్లూ ఉత్పత్తి కాదు. అది దొంగనిద్రో .... మంచి నిద్రో  బాడికి తెలుసు..  అప్పుడప్పుడు కళ్లు మఊసుకొని  ఉంటే దొంగ నిద్రపోతున్నావని పక్కవాళ్లంటారు. అది .నిజమో కాదో తెలియదు కాని ..   ప్రయాణాలు చేస్తూ..  వర్క్ ప్లేస్ లో ఉండి పోయే నిద్ర   .నిజంగా  దొంగ నిద్రేనని మన బాడీకి  తెలుసు అందుకే ఆ సమయంలో మెలటోనిన్ ఉత్పత్తికాదు నిద్రపట్టిన గంట నుంచి ఒక గంట యాభై నిమిషాల తర్వాత మెలటోనిన్​  బాడీలోకి రిలీజ్ అవుతుంది. 

మన బాడీలోకి విడుదలయ్యే మెలటోనిన్ లో 75 శాతం ఈ సమయంలోనే విడుదలవుతుంది. అందుకే ఏదైనా పని చూసుకుంటూ కునికిపాట్లు తీయడంవల్ల శరీరానికి పెద్దగా  మేలు ఉండదు. పిల్లల ఎదుగుదలకు ఈ మెలటోనిన్​  ఎక్కువగా సాయపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. నిద్రకు అసౌకర్యం లేకుండా నిద్రపోయేలా చూస్తే వాళ్లకు ఎదుగుదల సరిగా ఉంటుంది. 

తెల్లవారు జాముకి కోడిపుంజు కొక్కెరోక్కో అని కూస్తుంది. తెల్లవారగానే పక్షులు కిచకిచమంటూ కొమ్మలపై సందడి చేస్తాయి. సూర్యకిరణాలు తాకగానే విచ్చుకున్న పువ్వుల కోసం తుమ్మెదలు వాలిపోతాయి. పొద్దుగూకుతుంటే పక్షులన్నీ గుంపులు గుంపులుగా గూటికి చేరేందుకు తిరుగు పయనం కడతాయి. ఇలా పక్షులు చేసే పనులకు పొద్దుకి ఒక సంబంధం ఉంది. ఈ సంబంధాన్నే జీవగడియారం (సర్వేడియన్ రిథమ్) అంటారు. 

ప్రతి జీవిలో ఈ సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. గబ్బిలాలు పగులు పడుకుని, రాత్రి విహరిస్తాయి. అది వాటి రిథమ్. ఇలా ప్రతి జీవినీ రిథమ్ నడిపిస్తూ ఉంటుంది. మనిషికి కూడా ఇలాంటి రిథమ్ ఒకటుంది. చీకటి పడితే పడుకుని వెలుతురు వస్తే మేల్కొలుపుతుంది. జీవగడియారం.. అలారం వచ్చి జీవగడియారం పని చేయట్లేదు. అవసరాలకు తగ్గట్లు ఏరోజుకారోజు నెట్టుకొస్తుంటే రిథమ్ మారిపోతుంది. వాటితోపాటే ఎన్నో సమస్యలు వస్తున్నాయి.