
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి ఓ గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న రైలు బోయపల్లి గేట్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి ఆరో వ్యాగన్ పట్టాలు తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే ఆఫీసర్లు వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. పనులు పూర్తి కావడంతో రాత్రి పది గంటల తర్వాత రాళ్ల రాకపోకలు యథావిధిగా సాగాయి.