గూడ్స్ వాహనాలకు రాత్రి 9గంటల నుంచి ఉదయం 8 వరకు అనుమతి

గూడ్స్ వాహనాలకు రాత్రి 9గంటల నుంచి ఉదయం 8 వరకు అనుమతి

కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని..వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి..ఉదయం 10 గంటల మధ్యనే ప్రజలకు కావాల్సిన నిత్యావరసర వస్తువులను కొనుగోలు చేసేందుకు బయటకు రావాలని.. ఆ తర్వాత ఎవరు బయట కన్పించినా చర్యలు తప్పవన్నారు.

 హెల్త్ ఎమర్జెన్సీ, ఆక్సిజన్, మీడియా తో పాటు పర్మిషన్ ఇన్న వారికి మాత్రమే మినహాయింపునిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని..రీజన్ లేకుండా జనాలు అనవసరంగా రోడ్డుపై కి రావొద్దన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వారిపై కేసులు నమోదు, వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు. గూడ్స్ వాహనాలు హైదరాబాద్ లోపలకి రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు రావడానికి అనుమతి ఉందన్నారు. లాకౌ డౌన్ కు ప్రజలు..పోలీసులకు సహకరించాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.