మన ఐటీలకు షాక్ ఇస్తున్న బడా కంపెనీలు

మన ఐటీలకు షాక్ ఇస్తున్న బడా కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు, కొత్త గా వస్తున్న టెక్నాలజీ కి ప్రమోట్ అవ్వడం ద్వారా తమ కంపెనీ ఉద్యోగులకు నిర్దాక్షిణ్యంగా లేఆఫ్ చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్ వంటి ఇతర సంస్థలు కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున లేఆఫ్ ప్రకటించాయి.కొత్త రిక్రూట్ మెంట్ భారీగా పడిపోయింది. ఎంతలా అంటే.. 2022 తో పోలిస్తే 2023లో ఈ కంపెనీల యాక్టివ్ జాబ్ పోస్టింగ్ లు 90 శాతానికి పడిపోయాయి. 

ఈ క్రమంలో భారతదేశంలో ఐటీ ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్ వంటి సంస్థలు భారత్ లో తమ నియామకాల ప్రక్రియ చాలా మందకొడిగా సాగిందని ప్రకటించాయి. ఆర్థిక మాంద్యంతో కంపెనీల నిర్వహణ కారణంగానే ఈ నియామకాలు మందగించినట్లు భవిష్యత్ కూడా నియామకాలను నిలిపివేసే అవకాశం ఉందని ప్రకటించారు. 

ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఈ టెక్ దిగ్గజాలు ఉద్యోగ నియామకాలకు బ్రేకులు పడుతున్నాయి. 2022 తో పోలిస్తే.. భారత్ లో ఈ టెక్ దిగ్గజాల క్రియాశీల ఉద్యోగ పోస్టింగ్ లు90 శాతం క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీలు భారత్ లో 200 ఓపెన్ పొజిషన్ లను కలిగి ఉన్నాయి.. ఇది ఆ కంపెనీల నియామక స్థాయి నుంచి 98 శాతం తగ్గుదల అని నివేదికలు చెప్తున్నాయి.