Google : లేఆఫ్స్ కు వ్యతిరేకంగా గూగుల్ ఉద్యోగుల వాకౌట్

Google : లేఆఫ్స్ కు వ్యతిరేకంగా గూగుల్ ఉద్యోగుల వాకౌట్

గూగుల్ లో మొన్నటిదాకా ఉద్యోగుల తొలగింపులు సంచలనంగా మారగా.. తాజాగా ఉద్యోగులే రోడ్డుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా లండన్ కార్యాలయంలో గూగుల్ ఉద్యోగులు ఏప్రిల్ 4న వాకౌట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12వేల మంది స్టాఫ్ ను తొలగించాలని గూగుల్ తన ప్రణాళికలను ప్రకటించింది. అందులో భాగంగా సుమారు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగులు సైతం  తమ ఉద్యోగాలను కోల్పోయారు.

గూగుల్ తొలగింపుల ప్రభావం భారతదేశంలోని పలువురు ఉద్యోగులు పైనా పడింది. ఈ సందర్భంలోనే లండన్‌లో ట్రేడ్ యూనియన్ యునైట్‌లో సభ్యులుగా ఉన్న  గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్ పై ఏప్రిల్ 4న ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గూగుల్‌ సహా ఇతర టెక్‌ కంపెనీలు ఆర్థిక మాంద్యం, అనిశ్చితి కారణాలతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని సార్లు సరైన హెచ్చరికలు జారీ చేయకుండానే ఉద్యోగులను తొలగిస్తున్నాయని లింక్డ్‌ఇన్‌లోని కొన్ని పోస్టులు తెలియజేస్తున్నాయి. ఆర్థిక కారణాల వల్ల ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది.