మీ పని తనం చూడాలి.. ఆఫీసులకు వచ్చి పని చేయండి : గూగుల్

మీ పని తనం చూడాలి.. ఆఫీసులకు వచ్చి పని చేయండి : గూగుల్

కరోనా కారణంతో ఐటీ కంపెనీలు వర్క్​ ఫ్రం హోం సిస్టమ్​ పెట్టాయి. అయితే గూగుల్​ తమ సంస్థలో వర్క్​ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులను తిరిగి ఆఫీస్​లకు రావాలని సూచిస్తోంది. ఉద్యోగుల పని తీరు సమీక్షల్లో అటెండెన్స్​ను ఓ భాగంగా చేసినట్లు కంపెనీ తెలిపింది. వాల్ స్ట్రీట్​ జర్నల్​లో ప్రచురితమైన ఓ నివేదిక ఇదే అంశాన్ని హైలెట్​ చేసింది. రిటర్న్​ టు ఆఫీస్​ విధానాన్ని గూగుల్​అమలు చేస్తూ ఉద్యోగులపై ఎలా ఒత్తిడి తెస్తుందో ఇందులో పేర్కొంది.

ఉద్యోగులకు ఈ విషయమై గూగుల్​ మెయిల్స్ పంపుతోందని తెలిపింది. ప్రస్తుతం గూగుల్ హైబ్రీడ్​పాలసీ కలిగి ఉంది. ఇక్కడి ఉద్యోగి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తరచూ ఆఫీస్​లో రిపోర్ట్​ చేయలేని ఉద్యోగులకు రిమైండర్​లను పంపిస్తామని నివేదిక పేర్కొంది.