బార్డ్ చాట్బాట్ లాంచ్ చేసిన గూగుల్.. మొదట ఆ దేశాలకే

బార్డ్ చాట్బాట్ లాంచ్ చేసిన గూగుల్.. మొదట ఆ దేశాలకే

ఓపెన్ ఏఐ కంపెనీ చాట్జీపీటీ చాట్ బాట్ ని లాంచ్ చేసిన తర్వాత దానికి ఆదరణతో పాటు గట్టిపోటీనే ఎదురైంది. బడా టెక్ కంపెనీలన్నీ చాట్ జీపీటీ తరహా చాట్ బాట్ ఏఐని లాంచ్ చేసే పనిలో పడ్డారు. గూగుల్ కూడా చాట్ బాట్ కు పోటీగా బార్డ్ ను ప్రకటించింది. ఆ ఏఐని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా బార్డ్ లిమిటెడ్ యాక్సెస్ ను ఓపెస్ చేసినట్లు ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ ఫోన్లు వాడుతున్నవాళ్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతం యూఎస్, యూకేల్లో మాత్రమే గూగుల్ బార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇతరులు కూడా వెయిట్ లిస్ట్ లో జాయిన్ అయి గూగుల్ బార్డ్ ని టెస్ట్ చేయొచ్చు. ఇతర ప్రాంతాల్లో ఎప్పుడు అవకాశం లభిస్తుందనే అంశంలో గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ అందుకొని బార్డ్ ను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బార్డ్‌ ప్రాజెక్ట్ లీడ్స్ అయిన సిస్సీ హ్సియావో, ఎలి కాలిన్స్ అన్నారు.

గూగుల్ బార్డ్ వినియోగించాలంటే..

యూజర్లు ముందుగా bard.google.com ఓపెన్ చేయాలి. అందులో వెయిట్ లిస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేసి.. గూగుల్ అకౌంట్ తో సైనిన్ కావాలి. తర్వాత గూగుల్ బార్డ్ అప్ డేట్ నోటిఫికేషన్ కావాలా లేదా అని ఆప్షన్ వస్తుంది. అందులో ‘అవును’ అని క్లిక్ చేయాలి. మీకు యాక్సెస్ ఓకే అయిన తర్వా.., బార్డ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ యాడ్-ఆన్ ఫీచర్‌గా అందుబాటులో ఉంటుంది.