గూగుల్ ఆఫర్: ట్రిబుల్ జీతం ఇస్తాం..మీరు రాజీనామా చేయొద్దు

గూగుల్ ఆఫర్: ట్రిబుల్ జీతం ఇస్తాం..మీరు రాజీనామా చేయొద్దు

ప్రస్తుతం టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం కొనసాగుతుంది. వేలాది మంది ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి..ఎప్పుడు ఉద్యోగాలు ఊడుతాయోనని టెకీలు ఆందోళన  పడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. ఇలాంటి సందర్భంలో కూడా గూగుల్ ఓ ఎంప్లాయిని వదులుకోవడానికి ఇష్ట పడ లేదు. అతనికి 50 శాతం. కాదు..100 కాదుకాదు.. 300 శాతం జీతం పెంచి మరీ తన సంస్థలో కొనసాగాలని కోరింది. వివిరాలు తెలుసుకుందాం రండి. 

గూగుల్ తన కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి 300 శాతం జీతం పెంచింది. ఎందుకంటే.. ఆ ఉద్యోగి US కు చెందిన perplexity AI అనే మరో సంస్థకు మారాలని అనుకోవడంతో ఈ ఇలా అతడిని కూల్ చేసింది. ఈ విషయాన్ని perplexity AI  CEO అరవింద్ శ్రీనివాస్ బిగ్ టెక్నాలజీ పాడ్ కాస్ట్ లో స్వయంగా తెలిపారు. ఈ చర్య ఆ ఉద్యోగి అవసరం కంపెనీకి ఎంతలా ఉందో తెలుపుతుంది. జీతం పెంపు అందుకున్న ఉద్యోగి గూగుల్ లోని సెర్చ్ టీమ్ మెంబర్. AI లో స్పెషల్ అతను. 

2024లో భారీ తొలగింపులు 

ఇటీవల కాలంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కంపెనీ లేఆఫ్స్ గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. 2023లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల్లో 12000 మందిని అంటే 6శాతం ఉద్యోగులను తొలగించారు. 2024 జనవరి 10 నుంచి గూగుల్ లోని వివిధ విభాగాల్లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించారు.  కొత్త టెక్నాలజీ అభివృద్ధిలక్ష్యంగా అడ్వర్ టైజ్ మెంట్, పిక్సెల్, నెస్ట్, పిట్బిట్ టీంలలో వేలాది మందిని తొలగించారు. 

Also read: ఆస్ట్రేలియా బ్లాక్‌‌ వాటర్‌‌‌‌ కోల్‌‌ మైన్‌‌లో వాటాలు కొననున్న జేఎస్‌‌డబ్ల్యూ?