యూపీఐ చెల్లింపులలో లీడర్ గూగుల్‌ పే

యూపీఐ చెల్లింపులలో లీడర్ గూగుల్‌ పే

వెలుగు బిజినెస్‌‌ డెస్క్‌ : యూపీఐ చెల్లింపులలో గూగుల్‌ పే టాప్‌ ప్లేస్‌ లో నిలుస్తోంది. ఏప్రిల్‌ 2019 డేటా ప్రకారం ఫోన్‌ పె,పేటీఎం వంటి ఇతర పోటీదారులను కాలదన్నిగూగుల్‌ పే ముందడుగు వేస్తోంది. ఒక్క ఏప్రిల్‌నెలలోనే రూ. 49,700 కోట్ల చెల్లింపులు గూగుల్‌ ఎల్‌ ఎల్‌ సీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా జరిగాయి. ఇదే నెలలో ఫోన్‌ పె ద్వారా రూ. 42,610 కోట్లు, పేటీఎం ద్వారా రూ. 35,500 కోట్ల చెల్లింపులు జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. యూపీఐ ప్లాట్‌ ఫామ్‌ మొత్తం ఏప్రిల్‌ నెల చెల్లింపులు రూ. 1.42 లక్షల కోట్లలో 90 శాతం పై మూడింటి ద్వారానే జరగడం విశేషం. ఈ డేటాను నేషనల్‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండి యా (ఎన్‌ పీసీఐ) రూపొందించింది.

ట్రాన్సాక్షన్స్‌‌లో ఫోన్‌‌పె నెంబర్‌ 1..

చెల్లింపుల ట్రాన్సాక్షన్స్‌‌ సంఖ్యలో మాత్రం ఫోన్‌ పె ముందుంది. రెండో స్థానానికి పేటీఎం, గూగుల్‌ పే మధ్య గట్టిపోటీ నడుస్తోంది. ఏప్రిల్‌ లో 25.8 కోట్ల ట్రాన్సా క్షన్స్‌‌ జరిగాయని ఫోన్‌ పె చెబుతోంది. ఇక పేటీఎం, గూగుల్‌ పే 23–24 కోట్ల ట్రాన్సాక్షన్స్‌‌ను నిర్వహించాయి. పరిమాణపరంగా చూస్తే ఈ మూడూ కలిసి మొత్తం 78.2 కోట్ల ట్రాన్సా క్షన్స్‌‌లో  93 శాతంవాటా పొందుతున్నాయి. యూపీఐ అప్లికేషన్‌ భీమ్‌ ను నేషనల్‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ లో భీమ్‌ ద్వారా నేరుగా జరిగిన ట్రాన్సాక్షన్స్‌‌ మొత్తం 1.5 కోట్లైతే, వాటి విలువరూ. 6,600 కోట్లకే పరిమితమైంది.

పోటీ ఎక్కువే…

డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్లో ఎక్కువ మందే పోటీదారులున్నారు. ఐనా, 2017 సెప్టెంబరులో అడుగుపెట్టిన గూగుల్‌ పే చెప్పుకోదగ్గ విజయమే సాధించిం ది. మొదట్లో గూగుల్‌ తేజ్‌ పేరుతో మార్కెట్లోకి వచ్చినా, ఆ తర్వాత 2018 ఆగస్టులో దానిని గూగుల్‌ పే గా మార్చారు. ప్రపంచంలో ని ఇతర ప్రాంతాలలో పేమెంట్‌ సర్వీసెస్‌ కోసం నియర్‌ ఫీల్డ్‌‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ ఎఫ్‌ సీ) టెక్నాలజీ వాడుతున్నగూగుల్‌ ఒక్క ఇండియాలో మాత్రం యూపీఐ మీదే దృష్టి పెడుతోంది. ఎందుకంటే ఎన్‌ ఎఫ్‌ సీ ఇక్కడ ఇంకా వ్యాప్తి చెందలేదు. పేమెంట్‌ టెర్మినల్‌ కు కొద్దిదూరంలో నుంచే పేమెంట్‌ జరిపే వీలును NFC టెక్నాలజీ కల్పిస్తుం ది. పేమెంట్స్‌‌ సర్వీసుల రంగంలోమార్కెట్‌ లీడర్‌ గా ఎదగాలనేదే గూగుల్‌ దీర్ఘకాలికలక్ష్యమని మార్కెట్‌ నిపుణుడు ఒకరు చెప్పా రు.గూగుల్‌ పేలో ప్రస్తు తం రెండే రెం డు బేసిక్‌ ఫీచర్లున్నాయి. ఒకటి డబ్బు పంపడానికి, మరొకటి డబ్బు అందుకోవడానికి. డబ్బు పంపే, అందుకునే వ్యక్తులు ఈ అప్లికే షన్‌ ద్వారా ఒకరితో ఒకరు ఛాట్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మిగిలిన పోటీదారులలాగే మొదట్లో గూగుల్‌ కూడా క్యాష్‌ బాక్‌ లపైనే ఆధారపడింది. ఎక్కువ వాడే వాళ్లకి ఎక్కువ క్యాష్‌ బాక్స్‌‌ దొరికేలా ఆ విధానాన్ని రూపొందిం చారని పేమెంట్స్‌‌ సర్వీసెస్‌ నిపుణుడు అభిప్రాయపడ్డారు.

మరింత గడువు కోరుతున్న గూగుల్‌ పే..

ఇతర మల్టీ నేషనల్‌ కంపెనీలలాగే గూగుల్‌ పే కూడా డేటా లోకలైజేషన్‌ నిబంధనలతో ఇబ్బందులెదుర్కొంటోంది. డేటాను ఇక్కడ మాత్రమే అట్టే పెట్టా లనేనిబంధనను ఆర్‌ బీఐ కిందటేడాదే  ప్రకటించిం ది.ఈ నిబంధనలను గూగుల్‌ పే ఇంకా నెరవేర్చ వలసి ఉంది. అక్టోబర్‌ 2018 నాటికే డేటా లోకలైజేషన్‌ నిబంధనలను నెరవేర్చాలని ఆర్‌ బీఐ నిర్దేశించింది.కానీ, మాస్టర్‌ కార్డ్‌‌, వీసా, అమెరికన్‌ ఎక్స్‌‌ప్రెస్‌ వంటి కంపెనీలతో పాటు గూగుల్‌ కూడా ఈ నిబంధనలను వ్యతిరేకించింది. నిబంధనల సరళీకరణకు ఆర్‌ బీఐఏ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో మాస్టర్‌ , వీసాలు సెప్టెంబర్ దాకా గడువును కోరాయి. ఇక 2018 డిసెం-బర్‌ లో గా నిబంధనలను నెరవేరుస్తామని ఆ ఏడాది సెప్టెం బర్‌ లో గూగుల్‌ ఆర్‌బీఐని కోరింది. ఆ గడువు ముగిసిపోవడంతో ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌ దాకా పొడిగించమని గూగుల్‌ కోరుతోంది.

ముందు ముందు…..

మార్కెట్లోకి గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పెలు బాగానే చొచ్చుకు పోయినా, ఈ పేమెంట్‌ సర్వీసె స్‌ లో డబ్బు సంపాదించడం మాత్రం కాస్త కష్టంగానే ఉంటోంది. యూపీఐ సర్వీసెస్‌ అన్ని ప్రస్తుతం ఉచితంగానే దొరుకుతున్నా యి.ఈ చెల్లింపుల మీదా ఛార్జీలు విధించాలని కొన్నిబ్యాంకులు ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాయి.కాకపోతే పేమెంట్‌  ట్రాన్సా క్షన్స్‌‌ మీద వచ్చే ఫీజు రాబడి చాలా పరిమితంగానే ఉంటుంది. పేమెంట్‌ సర్వీసె స్‌ కు సంబంధించి తమ వద్దనున్న డేటాను మరిన్ని ప్రొడక్ట్స్‌ అమ్మకానికి ఎలా వాడుకోవాలనే దాని మీదే ఈ కంపెనీలన్నీ ఇప్పుడు దృష్టి పెడతాయని డిజిటల్‌ పేమెంట్స్‌ ‌ స్పె షలిస్ట్‌‌ నవీన్‌ సూర్య చెప్పా రు. ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌ అమ్ముకోవడానికి డేటాను ఇచ్చిపుచ్చుకోవడం ఇండియాలో సాధారణమేనని వ్యాఖ్యానిం చారు. గూగుల్‌ ఇప్పటిదాకా ఇండియాలోని పేటీఎం, ఫోన్‌ పెలతోనే పోటీ పడుతున్నా , భవిష్యత్‌ లో వాట్సప్‌ వంటి విదేశీ సంస్థలు సైతం వస్తే మరింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని ఈ రంగంలో నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో, పేమెంట్స్‌‌ సర్వీసెస్‌ రంగంలో ఎవరు విజేతగా నిలుస్తారో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.