ఈ స్మార్ట్ఫోన్ పై రూ.13వేల భారీ తగ్గింపు..డిటైల్స్ ఇవిగో

ఈ స్మార్ట్ఫోన్ పై రూ.13వేల భారీ తగ్గింపు..డిటైల్స్ ఇవిగో

మార్కెట్లో లభించే ప్రీమియం ఆండ్రాయిడ్ డివైజ్ లలో Google Pixel  స్మార్ట్ఫోన్ ఒకటి. ఇవి ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అందుకే కావచ్చు..ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్లను కొనలేకపోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో క్వాలిటీ కెమెరాలు ఉండటంతో ఫొటోగ్రఫీ ప్రియులకు ఎంతో ఇష్టం. మీకు ఇష్టమైన గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లను కొనాలని ఉన్నా.. అంత ఖర్చుతో కొనుగోలు చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్తోగూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. వివరాలు తెలుసుకుందాం రండి. 

Google Pixel 7ఆఫర్లు, డిస్కౌంట్లు 

2022లో లాంచ్ అయిన Google Pixel 7  స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అనేక ఫ్లాగ్ షిప్ ఫీచర్లను అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ చాలా చౌక ధరలో లభిస్తోంది.Google Pixel 7 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 59,999 . అయితే 25 శాతం భారీ డిస్కౌంట్ తో దాదాపు 13 వేల రూపాయల తగ్గింపుతో రూ. 44,999 కి ఇప్పుడు ఈ కామర్స్ వెబ్ సైట్ లో లభిస్తోంది. అదనంగా ఎక్ఛేంజ్ ఆఫర్ లో ఇది రూ. 36వేల కే లభిస్తోంది. 

google Pixel 7 ప్రత్యేకతలు 

google Pixel 7 స్మార్ట్ ఫోన్ లో 6.3 అంగుళాల AMOLED డిస్ ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ , HDR10+1000nts పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. రక్షణకోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్  ఆండ్రాయిడ్ 13 OS తో నడుస్తుంది. దీనిని ఆండ్రాయిడ్ 14  OS  కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందుల్లో 5nm టెక్నాలజీతో ఆక్టా కోర్ ప్రాసెసర్ టెన్సార్ G2తో పనిచేస్తుంది. ఈ డివైజ్ లో 8GB RAM, 256 GB స్టోరేజ్ ఉంటుంది. 

ఫొటో గ్రఫీ కోసం బ్యాక్ లో 50MP +12 MP  డ్యుయెల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే.. 10.8 MP ఫ్రంట్ షూటర్  ఉంటుంది. దీనిలో 4355 mAh సామర్థ్యంతో బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.