టెక్నాలజీ..సెర్చ్​ రిజల్ట్స్ రిమూవ్​ చేయొచ్చు!

టెక్నాలజీ..సెర్చ్​ రిజల్ట్స్ రిమూవ్​ చేయొచ్చు!

గూగుల్ సెర్చ్ పేజీలో మీ పేరును సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, ఫొటోలు వంటివి కనిపిస్తుంటాయి. అవి ప్రొఫెషన్​ పరంగా అయితే ఓకే. కానీ, పర్సనల్​ డాటా కూడా అందులో కనిపిస్తే? ప్రైవసీకి ఇబ్బంది కదా. అలా కనపడకూడదు అనుకుంటే గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​లో ఆ కంటెంట్​ను డిలీట్​ చేయొచ్చు.  పర్సనల్ డాటాలో ఇంటి అడ్రెస్, ఫోన్​ నెంబర్ లేదా ఇ–మెయిల్​ అడ్రెస్ వంటి డీటెయిల్స్ ఈజీగా తీసేయొచ్చు. అయితే ఇప్పటికి ఈ టూల్​ ఇండియాలో అందుబాటులో లేదు. కానీ, గూగుల్ ప్రొడక్ట్​లు, సర్వీస్​ల నుంచి చట్టవిరుద్ధమైన కంటెంట్​ గురించి ఇండియన్​ యూజర్లు రిపోర్ట్​ చేయొచ్చు.

ఇలా కనిపెట్టొచ్చు

  •     గూగుల్ సెర్చ్​ రిజల్ట్స్​లో పర్సనల్​ డాటాను కనిపెట్టాలంటే... గూగుల్ యాప్​కి లాగిన్ అయ్యి, గూగుల్ అకౌంట్​ అవతార్ (ప్రొఫైల్)ను క్లిక్ చేసి మెనూని ఓపెన్      చేయాలి. అక్కడ కనిపించే ‘రిజల్ట్స్ అబౌట్​ యు’ అనే ఆప్షన్​ సెలక్ట్​ చేయాలి. 
  •     మొబైల్​ వెబ్​ లేదా డెస్క్​టాప్​లో యూజర్లు తమ గూగుల్ అకౌంట్లకు లాగిన్ చేయొచ్చు. తర్వాత గూగుల్ అకౌంట్​ అవతార్​ మీద క్లిక్ చేయాలి. 
  •     మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్​లోకి వెళ్లి డాటా అండ్ ప్రైవసీ ఆప్షన్​ సెలక్ట్​ చేసుకోవాలి. 
  •     హిస్టరీ సెట్టింగ్స్​లోకి వెళ్లి ‘మై యాక్టివిటీ’లో అదర్ యాక్టివిటీని సెలక్ట్​ చేసుకోవాలి.
  •     రిజల్ట్స్ అబౌట్​ యు సెక్షన్​ను కిందికి స్క్రోల్ చేస్తే మేనేజ్ రిజల్ట్స్ అబౌట్​ యు ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసి, గెట్ స్టార్టెడ్​ లేదా సెట్టింగ్స్ మీద క్లిక్        చేయాలి.
  •     సెర్చ్ రిజల్ట్స్​లో పేరు, కాంటాక్ట్​ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ డాటాను చూపించే సెర్చ్​ రిజల్ట్స్ కోసం చెక్ చేయడానికి గూగుల్ ఇప్పుడు ఈ డాటానే                 వాడుతుంది. సెర్చ్ రిజల్ట్స్ ద్వారా డాటా సరిపోతే అప్​ డేట్ అవ్వడానికి నోటిఫికేషన్​ని ఎనేబుల్ చేయాలి. బ్రౌజర్​లో నోటిఫికేషన్లు ఆన్​లో ఉంటే సెర్చ్               రిజల్ట్స్ పేరు, పర్సనల్​ డాటా ఒకేలా ఉంటే కొన్ని గంటల్లోనే నోటిఫికేషన్ వస్తుంది. 
  •     రిజల్ట్స్ అబౌట్​ యు పేజీ నుంచి కూడా డైరెక్ట్​గా చెక్ చేయొచ్చు. రిజల్ట్స్ చూడ్డానికి రిజల్ట్స్ అబౌట్​ యు పేజీ నుంచి రిజల్ట్స్ టు రివ్యూ ట్యాబ్​కు వెళ్లాలి. సెర్చ్ రిజల్ట్స్ సెలక్ట్ చేసుకున్నప్పుడు వెబ్​సైట్​ లేదా దానిలోకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి గురించి మరింత తెలుసుకోవచ్చు. 

రిమూవ్ చేయాలంటే..

  •     యూజర్లు పర్సనల్ డాటాకు సంబంధించిన యూఆర్​ఎల్​ కలిగి ఉంటే గూగుల్ సెర్చ్​లో రిపోర్ట్ చేయొచ్చు. 
  •      గూగుల్ సెర్చ్​లో పేరు కోసం సెర్చ్​ చేస్తే, అబౌట్ దిస్ రిజల్ట్ ప్యానెల్​ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి, రిజల్ట్స్ దగ్గర మోర్​ (మూడు చుక్కలు) మీద క్లిక్                 చేయాలి. 
  •      అప్పుడు ఇట్ షోస్ మై పర్సనల్ కాంటాక్ట్​ ఇన్ఫో కనిపిస్తుంది. అందులో రిమూవ్ రిజల్ట్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. తర్వాత రిపోర్టింగ్ ఫ్లో ద్వారా వెళ్లి, రిక్వెస్ట్​ను          సబ్మిట్​ చేయాలి.  తర్వాత ‘ఐయామ్​ డన్’​ అనే ఆప్షన్​ మీద క్లిక్ చేయాలి. 

రిమూవ్ చేయడానికి రిక్వెస్ట్​

పర్సనల్ డాటాను ప్రైవేట్​గా ఉంచాలనుకుంటే సెర్చ్ రిజల్ట్స్ నుంచి తొలగించమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక రిజల్ట్‌ డిలీట్ చేయడానికి రిక్వెస్ట్​ టు రిమూవ్​ రిజల్ట్స్ ఎంచుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ రిజల్ట్స్ తొలగించడానికి ప్రతి రిజల్ట్​ పక్కన ఉన్న చెక్ బాక్స్​ని సెలక్ట్​ చేయాలి. డాటా రిమూవ్ రిక్వెస్ట్ వద్దనుకుంటే.. మార్క్ యాజ్ రివ్యూవ్డ్​ అనే ఆప్షన్​ సెలక్ట్​ చేసుకోవచ్చు.

గూగుల్ కొన్ని సెర్చ్​ రిజల్ట్స్​ విలువైనవిగా పరిగణిస్తుంది. అందులో గవర్నమెంట్​ లేదా ఎడ్యుకేషనల్ వెబ్​సైట్​లు, ఆన్​లైన్​ న్యూస్ పేపర్స్ లేదా బిజినెస్ వెబ్​సైట్స్ ఉండొచ్చు. ఇలాంటి వెబ్​సైట్​ నుంచి సెర్చ్ రిజల్ట్స్​ వస్తే, రిమూవ్​ రిజల్ట్​ ఆప్షన్​ కనిపించదు. రిమూవల్ రిక్వెస్ట్​ కన్ఫామ్​ చేయడం రిక్వెస్ట్​ రివ్యూ స్టేటస్ వంటి అప్​డేట్స్ ఇ–మెయిల్​కి వస్తాయి. రిమూవల్​ రిక్వెస్ట్స్​ కింద రిజల్ట్స్​ అబౌట్​ యు నుంచి ఎప్పుడైనా రిక్వెస్ట్​ స్టేటస్ చెక్ చేయొచ్చు.