మీరు గ్రేట్ : తీసేస్తున్న ఉద్యోగులకు రూ.17 వేల కోట్లు చెల్లిస్తున్న గూగుల్

మీరు గ్రేట్ : తీసేస్తున్న ఉద్యోగులకు రూ.17 వేల కోట్లు చెల్లిస్తున్న గూగుల్

ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసింది. అందులో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఉంది. 2023 సంవత్సరంలో 12వేల ఉద్యోగులకు గూగుల్ లేఆఫ్స్ ప్రకటించింది. అయితే తీసేసిన ఉద్యోగులను ఉట్టి చేతులతో ఇంటికి పంపించకుండా వారిని కొంత మొత్తాన్ని చెల్లించిందని ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఆదాయ గణాంకాల్లో వెల్లడించింది. 

2023లో గూగుల్ సుమారు 12వేల ఉద్యోగులను తొలగించింది.అయితే తొలగింపుల సమయంలో ఉద్యోగులకు కంపెనీ నియమనిబంధనల ప్రకారం వారికి రూ. 17,500 కోట్లు చెల్లించింది. ఈ నెలలో కంపెనీ ఇప్పటికే 1000 కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. వీరికి కూడా 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ మంగళవారం తన నాలుగో త్రైమాసిక ఆదాయాల గణాంకాల్లో వెల్లడించింది.