
గూగుల్ ఈ ఏడాది చివరి కల్లా అందుబాటులోకి తేనున్న కొత్త ఫీచర్స్ ఇవే..
సినిమాటిక్ మూమెంట్స్
గూగుల్ ఫొటోస్‌లో చాలా ఇమేజెస్ సేవ్ చేసుకోవచ్చు. వాటిలో ఉండే స్టిల్ ఫొటోస్‌ను యానిమేటెడ్ ఫొటోస్‌గా మార్చుకునే ఫీచర్ ఇది. ఎవరైనా ఫొటో తీసుకోవాలనుకునేటప్పుడు రెండు, మూడు స్టిల్స్ తీసుకుంటారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ స్టిల్స్ అన్నీ కలిపి యానిమేటెడ్ ఫొటోలుగా మారుతాయి. ఈ ఫొటోలు సినిమాటిక్ మూమెంట్స్‌లా కనిపిస్తాయి.
స్క్రీన్‌షాట్స్
చాలామంది ఆన్‌లైన్‌లో నచ్చిన ప్రొడక్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకుంటారు. వీలున్నప్పుడు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందని ఈ పని చేస్తారు. అయితే, గూగుల్ లెన్స్ యాప్ ద్వారా స్క్రీన్ షాట్‌తో డైరెక్ట్‌గా షాపింగ్ చేయొచ్చు. స్క్రీన్‌షాట్ తీసుకున్న ప్రొడక్ట్ ఏ సైట్‌లో దొరుకుతుందో ఈ ఫీచర్ ద్వారా తెలుస్తుంది.
ఆండ్రాయిడ్ రిమోట్
ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో బిల్ట్ ఇన్ రిమోట్ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ టీవీతోపాటు, ఆండ్రాయిడ్ టీవీలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే రిమోట్‌లా ఆపరేట్ చేయొచ్చు. ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో అయినా ఆపరేట్ చేయొచ్చు.
డిజిటల్ కార్ కీ
ఆండ్రాయిడ్ ఆటో–ఎనేబుల్డ్ కార్స్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తోనే లాక్, అన్‌లాక్, స్టార్ట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వెర్షన్ ఫోన్లలోనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ ముందుగా పిక్సెల్, సామ్‌సంగ్ ఫోన్స్‌లోనే రిలీజవుతుంది. తర్వాత మిగతా ఫోన్స్‌లోకి వస్తుంది.
క్విక్ డిలిట్
రెగ్యులర్‌గా గూగుల్ సెర్చ్ వాడేవాళ్ల హిస్టరీ పెరుగుతూనే ఉంటుంది. ఇకపై ఈ హిస్టరీని చాలా క్విక్‌గా డిలీట్ చేసుకోవచ్చు. ‘క్విక్ డిలీట్’ ఫీచర్ ద్వారా పావుగంటకోసారి గూగుల్ హిస్టరీని ఆటో డిలిట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.
ఫొటోస్ లాక్ ప్రొటెక్టర్
గూగుల్ ఫొటోస్‌ను ప్రొటెక్ట్ చేసుకునేందుకు పాస్‌వర్డ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తుంది గూగుల్. ఫోల్డర్‌లో యాడ్ అయిన ఫొటోలను పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌తో లాక్ చేసుకోవచ్చు ముందుగా ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే వస్తుంది.
చేంజ్ పాస్‌వర్డ్
గూగుల్ పాస్‌వర్డ్స్ లీకైనా, హ్యాకింగ్‌కు గురైనా వెంటనే పాస్‌వర్డ్ చేంజ్ చేయడం చాలా ముఖ్యం. గూగుల్ క్రోమ్ ద్వారా దీనికి సంబంధించిన అలర్ట్స్ పొందొచ్చు. కొత్త ఫీచర్ ద్వారా పాస్‌వర్డ్స్ లీక్, హ్యాకింగ్‌కు గురైతే వెంటనే పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోమని అలర్ట్ ఇస్తుంది ‘క్రోమ్’. అలాగే స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేసుకునేలా కూడా కొత్త ఫీచర్ హెల్ప్ చేస్తుంది.
న్యూ మెమరీస్
గూగుల్ ఫొటోస్‌లో ఫొటోల ప్రత్యేకత ఆధారంగా మెమరీస్‌ను క్రియేట్ చేసి అందిస్తుంది. అంటే సంవత్సరం, రీసెంట్ హైలైట్స్, మూమెంట్స్, పర్సన్స్ ఆధారంగా మెమరీస్‌ను క్రియేట్ చేస్తుంది. ఫొటో షేప్, కలర్, టైమ్ వంటి ఆధారంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ ఫీచర్ పనిచేస్తుంది.
సేఫ్ రూట్
గూగుల్ మ్యాప్స్‌లో రెగ్యులర్‌గా ఫీచర్స్ అప్‌డేట్ అవుతున్నాయి. త్వరలో సేఫ్ రూట్ అనే మరో ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ ద్వారా సురక్షితమైన రూట్‌ను గూగుల్ సూచిస్తుంది. అంటే యాక్సిడెంట్స్ తక్కువగా జరిగే అవకాశం ఉన్న రూట్, ఎంత సేఫ్‌గా ఉంటుంది అనే అంశాల ఆధారంగా ఈ రూట్‌ను సూచిస్తుంది. అలాగే కస్టమైజ్డ్ రికమండేషన్స్ కూడా అందిస్తుంది. అంటే ఉదయం పూట కాఫీ షాప్స్, ఈవెనింగ్ రెస్టారెంట్స్ వంటివి సజెస్ట్ చేస్తుంది.