స్నాక్స్ పెడ్తలేరని డీఈవోకు కంప్లైంట్

స్నాక్స్  పెడ్తలేరని డీఈవోకు కంప్లైంట్

గోపాల్ పేట, వెలుగు: మండలకేంద్రంలోని హైస్కూల్ ను  గురువారం డీఈవో గోవిందరాజులు తనిఖీ చేశారు. స్కూల్ లో ఉదయం పూట రాగి జావ ఇస్తున్నారా? అని విద్యార్థులను ప్రశ్నించగా, స్నాక్స్ ఇస్తలేరని కంప్లైంట్​ చేశారు. దీనిపై టీచర్లను డీఈవో నిలదీసి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరగాలని, మెనూ ప్రకారం ఫుడ్  అందించకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. టైం టేబుల్  తయారు చేసుకొని ప్రతి సబ్జెక్టును అర్థమయ్యేలా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్పెషల్  క్లాస్ లకు స్నాక్స్  ఇవ్వాలన్నారు. పరీక్షలకు నెల రోజులే టైం ఉందని, కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్  కావాలని సూచించారు. ఇన్​చార్జి హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, టీచర్లు  పాల్గొన్నారు.