షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ యువనేత గోటిక గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా మొత్తంగా ఆరుగురు నామినేషన్లు వేయగా, ఐదుగురు బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గోపాల్ రెడ్డి ఒక్కరే బరిలో నిలిచి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందనలు తెలిపారు. గ్రామస్తుల ఐకమత్యం అభివృద్ధికి నిదర్శనమన్నారు.
