బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది: గోపీచంద్ మలినేని

బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది: గోపీచంద్ మలినేని

నందమూరి బాలకృష్ణ అభిమానిగా, సమర సింహారెడ్డి ఫస్ట్ డే చూసి రోజంతా జైల్లో ఉన్న అభిమానిగా తీసిన సినిమా 'వీరసింహారెడ్డి' అని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు. బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ  #NBK107 కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారైంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. 

ఈ సందర్భంగా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా గురించి మాట్లాడాడు. ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని అన్నాడు. సమరసింహా రెడ్డి ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్ వీరసింహా రెడ్డి ఇస్తుందన్నాడు. అభిమానులు ఊహించినదాని కంటే రెండింతలు ఎక్కువ ఉంటుందని.. సంక్రాంతికి మన వీరసింహారెడ్డి విజ్రుభించబోతున్నాడని తెలిపాడు. బాలకృష్ణని డైరెక్ట చేయడం తన అదృష్టం.. థియేటర్లో మోత మాములుగా ఉండదని చెప్పాడు. ఫ్యాన్స్ లానే నేను కూడా థియేటర్ లో చూడాలని ఎదురుచూస్తున్నా గోపీచంద్ అన్నాడు. 

ఈ సినిమా షూటింగ్ ఇంకా ఇరవై రోజులు ఉందని గోపీచంద్ తెలిపారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. ఈ సినిమాలోఅంత స్టఫ్ ఉందన్నాడు. ''వీరసింహా రెడ్డి పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' ఇలాంటి చాలా డైలాగులు సినిమాలో వున్నాయన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నా కలని సాకారం చేస్తూ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారని.. సాయి మాధవ్ బుర్రా డైలాగుల్లో వీరసింహారెడ్డి విశ్వరూపం చూస్తారని అన్నాడు. తమన్ మ్యూజిక్ మాములుగా వుండదు.. సాంగ్స్ డ్యాన్స్ లు అదిరిపోతాయన్నాడు. మన బాలయ్యని ఎలా చూడాలని అనుకుంటామో అలా ఉంటుంది ఈ సినిమా.. సంక్రాంతికి మీ ముందు వస్తున్నాం అని గోపీచందర్ అన్నాడు. 

టైటిల్ పోస్టర్ విషయానికొస్తే.. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' యాప్ట్ టైటిల్ గా ఉంది. 'సింహా'పేరుతో బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది.  టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ ఫెరోషియస్ గా కనిపించారు. పోస్టర్ పై గర్జించే సింహం బాలకృష్ణ క్యారెక్టర్ ని ప్రతిబింబిస్తుంది.  బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహాలా కనిపిస్తున్నారు. పులిచెర్ల 4 కిలోమీటర్ల మైల్ స్టోన్ కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ హంట్ కు భారీ స్పందన వచ్చింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా నిర్మాతలు వెల్లడించారు.