
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో నటుడిగానే కాక హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు సుహాస్. తను సినిమాలో ఉన్నాడంటే కచ్చితంగా అది కంటెంట్ బలంగా ఉన్న సినిమానే అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ‘గొర్రె పురాణం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుహాస్. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (అక్టోబర్ 21న) థియేటర్స్‌లో విడుదలైంది. టైటిల్, టీజర్‌తో ఆసక్తిరేపిన ఈ సినిమా ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథగా...
రవి (సుహాస్) ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. మరోవైపు రామ్ అలియాస్ యేసు అనే గొర్రె తన యజమాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. కసాయి వాడినే గొర్రె నమ్ముతుందనే సామెతను నిజం చేస్తూ.. ఓ దళారి దగ్గరకు చేరుతుంది. దాన్ని కొనుగోలు చేసిన ఓ ముస్లిం వ్యక్తి తమ మత సంప్రదాయాల ప్రకారం జుబా చేసే సమయానికి, అతని కూతురు ఆ గొర్రెపై ప్రేమతో తప్పిస్తుంది. అలా తప్పించుకున్న గొర్రె ఓ గ్రామదేవత ఆలయంలో దూరి.. కల్లు తాగి జట్కా ఇస్తుంది. ఆ దేవతే దాన్ని పంపింందని భావించిన భక్తులు.. బలి ఇవ్వాలనుకుంటారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుటుంది. దీంతో రెండు మతాల వాళ్లు దాని వెంట పడతారు. గొర్రె ఎవరికి దక్కాలి అనే విషయంపై పంచాయితీ జరుగుతుంది.
ఇది కాస్తా సోషల్ మీడియాకు, అటు నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వెళ్తుంది. మత కలహాలకు కారణమైందని, మనో భావాలు దెబ్బతీస్తోందని ఆ గొర్రెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆ గొర్రెను రిమాండ్‌కు పంపుతుంది. హత్య కేసులో జైలులో ఉన్న రవి సెల్‌లోనే గొర్రెను కూడా బంధిస్తారు. రవి ఎందుకు ఆ హత్య చేశాడు, అతని గతం ఏమిటి.. జైలులో ఉన్న గొర్రెను చంపడానికి ప్రయత్నించింది ఎవరు.. గొర్రెను తప్పించాలనుకున్న రవి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో లీడ్ రోల్ గొర్రెది. దాని నుంచి నటన రాబట్టలేం కనుక దర్శకుడు తరుణ్ భాస్కర్ చేత ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించి ఆ కొరత తీర్చారు. మరో గొర్రెకు గెటప్ శ్రీను డబ్బింగ్ చెప్పాడు. రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరు ఇచ్చే వాయిస్‌లు నవ్వించాయి. సుహాద్‌వి ఇందులో కీలక పాత్. తన పాత్రకు నిడివి తక్కువ అయినప్పటికీ కథకు తగ్గట్టుగా ఒదిగిపోతూ, రవి అనే ఖైదీ పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ రఘు, పోసాని కృష్ణ మురళి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో చాలామంది కొత్తవాళ్లు కనిపించారు. ఇక సోషల్ సెటైర్స్‌తో ప్రేక్షకులను నవ్విస్తూనే, మరోవైపు ఆలోచింపజేసేలా డైలాగ్స్ రాసుకున్నారు. పవన్ సీహెచ్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని క్యారీ చేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఎలా ఉందంటే....
టైటిల్‌కు తగ్గట్టే ఇది ఒక గొర్రె కథ. తమ సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాజకీయ నేతలు మరో సమస్యను తెరపైకి తీసుకొచ్చి, అందులో ఎవరో ఒకరిని బలిపశువును చేస్తుంటారు. ఒక్కోసారి ఆ బలిపశువు నోరు లేని గొర్రె కూడా కావొచ్చు అనేది ఇందులో మెయిన్ కాన్సెప్ట్. అంతేకాదు ఒక కొత్త విషయం తెరపైకి రాగానే, జనం కామన్ సెన్స్ వాడకుండా గొర్రెల్లా దాన్ని ఫాలో అవుతుండటం లాంటి అంశాలను దర్శకుడు వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశాడు. ఓ మర్డర్ సీన్‌తో కథను ప్రారంభించి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాడు దర్శకుడు. ఆపై ఒక గొర్రె వల్ల రెండు మతాల మధ్య గొడవలు జరగడం మొదలు, కోర్టు కేసులు, మీడియా చర్చలు, జంతు సంరక్షణ సంఘాలు, రాజకీయ వ్యూహాలు, సోషల్ మీడియా ట్రెండింగ్స్ వరకూ చాలా విషయాలపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతూ ఓ సోషల్ సెటైర్ మూవీగా దీన్ని తెరకెక్కించాడు.
ఇదే తరహాలో ఇటీవల ‘దీపావళి’ అనే తమిళ చిత్రం వచ్చింది. కథ, నేపథ్యాలు పూర్తిగా వేరు. కానీ ఇది చూస్తుంటే పద్నాలుగేళ్ల క్రితం ఆమీర్ ఖాన్ నిర్మించిన ‘పీప్లి లైవ్’ సినిమా గుర్తొస్తుంది. ఆ స్థాయి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని నడిపించడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు. సోషల్ సెటైర్‌ను బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ, ఇలాంటి కథలకు ప్రధానంగా అవసరమైన ఎమోషన్ మిస్ అయింది. అదీకాక కీరోల్ అయిన సుహాస్ క్యారెక్టర్, తన ప్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవలేదు. ఒకరి హత్య కేసులో జైలు కెళ్లిన అతను, మరో ఇద్దరిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే విషయాన్ని టచ్ చేయలేదు.
ALSO READ : Devara: థియేటర్లలో పూనకాలు పక్కా.. అంచనాలు పెంచేసిన దేవర DOP పోస్ట్
బహుశా... క్లైమాక్స్‌లో చూపించినట్టు ఈ సినిమా సీక్వెల్ కోసం వాటిని దాచి ఉండొచ్చు. కానీ కథను అసంపూర్తిగా వదిలేశాడనే భావన కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఆ విషయంలో దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చే విషయంలో తడబడ్డాడు. కొంత బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు. స్క్రీన్ ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. గొర్రె చుట్టూ సాగే కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టకుండా సాగింది. సెకండాఫ్‌లో ఫన్ కాస్త తగ్గినా, కోర్టులో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. 1 గంట 42 నిముషాల నిడివి ఈ సినిమాకు ప్లాస్ పాయింట్. లాజిక్స్ పట్టించుకోకుండా ఒకసారి చూసేయొచ్చు.