టిక్‌టాక్ ప్రొ పేరుతో మోసాలు..

టిక్‌టాక్ ప్రొ పేరుతో మోసాలు..

న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందనే కారణంతో 59 చైనా యాప్స్‌ను ఇండియా సర్కార్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. నిషేధిత జాబితాలో మిగతా యాప్స్‌తోపాటు 200 మిలియన్‌ల ఇండియన్ యూజర్స్‌ను కలిగి ఉన్న టిక్‌టాక్‌ కూడా ఉన్న సంగతి విధితమే. ఈ బ్యాన్‌తో టిక్‌టాక్‌లా ఉండే ఆల్టర్నేటివ్ యాప్స్‌కు ఇండియా మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. దీని వల్ల కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. కొందరు స్కామర్స్ టిక్‌టాక్ కొత్త వెర్షన్ పేరుతో యూజర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు.

అమాయక స్మార్ట్‌ఫోన్స్ యూజర్స్‌ను టార్గెట్‌గా చేసుకొని వారికి యాప్ లింక్‌ను వాట్సాప్ చేస్తున్నారని సమాచారం. టిక్‌టాక్‌ ప్రొ పేరుతో నెటిజన్స్‌ను‌ మోసం చేస్తున్నారు. టిక్‌టాక్‌లాగా ఉండే సదరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే టైమ్‌లో కెమెరా, మైక్ లాంటి పర్మిషన్స్‌ను అడుగుతోందని తెలిసింది. ఆ తర్వాత సదరు యాప్ పని చేయట్లేదని యూజర్లు చెబుతున్నారు. ఈ తరహా యాప్‌ గూగుల్ ప్లేలో అందుబాటులో లేకపోవడమే గాక నెట్‌లో మరెక్కడా అవేలబుల్‌గా ఉండకపోవడం గమనార్హం. దీనిపై పలువురు ట్విట్టర్‌‌ యూజర్లు తమ ఫోన్స్‌లో వచ్చిన మెసేజ్‌లను పోస్ట్‌ చేశారు.