
భారతదేశంలో కోట్ల మంది ప్రజలు తమ ఆధార్ కార్డులను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గ్యాస్ సబ్సిడీ నుంచి వివిధ స్కీమ్స్ కింద డీబీటీ చెల్లింపులు నేరుగా చేసేందుకు ఆధార్-బ్యాంక్ ఖాతా లింకింగ్ తప్పనిసరిగా మార్చటమే దీనికి కారణం. అయితే ఈ క్రమంలో చాలా మందికి తమ డబ్బు సేఫ్టీ పై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్థిక మోసగాళ్లు దీనిని ఆయుధంగా మార్చుకుని తమ ఖాతాలు ఖాళీ చేస్తారనే భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి.
ప్రజలకు ఉన్న భద్రతాపరమైన అనుమానాలపై ఆధార్ సంస్థ యూఐడీఏఐ స్పందించింది. ఆధార్ వివరాలను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసినంత మాత్రాన అది వేరే వ్యక్తులకు మీ ఖాతాలోని డబ్బుకు యాక్సెస్ ఇవ్వదని పేర్కొంది. ఆధార్ ద్వారా ఏదైనా ఆర్థిక లావాదేవీని చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది. ఆధార్ కేవలం ఇతర సేవల కోసం వెరిఫికేషన్ ఓటీపీ, బయోమెట్రిక్ సేవలను మాత్రమే అందిస్తుందని చెప్పింది. మీ ఆధార్ కార్డ్ నంబర్ వేరేవారికి తెలిసినంత మాత్రాన దాంతో మీ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు దొంగిలించటం కుదరదని యూఐడీఏఐ చెబుతోంది.
ALSO READ | UPI News: షాకింగ్.. లైఫ్ లాంగ్ యూపీఐ ఫ్రీ కాదు.. తేల్చి చెప్పేసిన RBI గవర్నర్..!
ఆధార్ వ్యవస్థ తగిన రక్షణను కలిగి ఉంటుందని తెలిసిందే. ఆధార్ వ్యవస్థను సురక్షితంగా తయారు చేసినప్పటికీ, ప్రజలు తెలియకుండానే సున్నితమైన సమాచారాన్ని సమర్పిస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. స్కామర్లు కస్టమర్లకు కాల్ చేయడం ద్వారా లేదా జనరేట్ చేయబడిన లింక్‌లను పంపడం ద్వారా OTPలు లేదా బ్యాంక్ పాస్‌వర్డ్‌లను నమోదు చేసేలా మోసగించవచ్చు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన లోపం వల్ల మాత్రమే ఇక్కడ స్కామ్స్ జరిగే అవకాశం ఉంది. ప్రజలు తమ యూఐడీఏఐ ఆధార్ బయోమెట్రిక్స్ ను లాకింగ్ చేసుకోవటం ద్వారా ఏదైనా లావాదేవీ కోసం మీ బయోమెట్రిక్ డేటాను దొంగరు వినియోగించటం కుదరదు.
ఇతరులకు ఆధార్, పాన్ కార్డ్ వివరాలు, బ్యాంక్ ఓటీపీలు, సీవీవీ నంబర్లను అందించకుండా ఉండటం ద్వారా బ్యాంకులోని డబ్బును సేఫ్ గా ఉంచుకోవచ్చు. ఏదైనా ఆధార్ ఆధారిత లావాదేవీపై హెచ్చరికను స్వీకరించడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవటం ఉత్తమం. అలాగే మీ ప్రమోయం లేకుండా వినియోగం గురించి మీకు మెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం వస్తే వెంటనే దానిపై కంప్లయింట్ ఇవ్వటం మంచిది.