బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో గోవర్ధన పూజ, కార్తిక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం గోవర్ధన పర్వత ప్రతిరూపాన్ని ఆవిష్క రించి, వివిధ రకాల పిండివంటలు, స్వీట్లతో కూడిన అన్నకూటాన్ని రాధా గోవిందులకు సమర్పించారు. భక్తులందరికీ అన్నప్రసాదాన్ని వడ్డించారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర స్వామిజీ మహారాజ్ పాల్గొన్నారు.
– హైదరాబాద్ సిటీ, వెలుగు
