
దేశ రాజకీయాలలో కాకా వెంకటస్వామి భీష్ముడని గవర్నర్ తమిళిసై అన్నారు. కాకా అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకా పేదల కోసం ఎంతో కృషి చేశారని.. ప్రజలతో మమేకమై వారి అభ్యున్నతికి శ్రమించారని చెప్పారు. వెంకటస్వామి స్పూర్తిదాయకమైన లీడర్ అని కొనియాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. ఇన్సిటిట్యూషన్ కోసం డోనేషన్స్ తీసుకోకపోవడం గొప్ప విషయమన్నారు.
అంబేద్కర్ ఇన్సిటిట్యూషన్ లో చాలా మంది స్టూడెంట్స్ మంచి ర్యాంకులు తెచ్చుకున్నారని గవర్నర్ అభినందించారు. అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకుసాగాలని సూచించారు. తల్లిదండ్రుల వల్లే విద్యార్థులు ఉన్నతస్థానాలకు చేరుకుంటారని..వారిని మర్చిపోవొద్దని సూచించారు. సరోజా వివేక్ కాలేజ్ను అద్భుతంగా నడిపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ అప్పుడే పుట్టిన బిడ్డ లాంటిదని.. గైనకాలజిస్ట్ ను అయిన తనకు పుట్టిన బిడ్డను ఎలా చూసుకోవాలో తెలుసని చెప్పారు.