కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ

కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాతరాజంపేట, సరంపల్లి, టెకిర్యాల్​లో ఆయన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.  ఆయా చోట్ల నిర్వహించిన మీటింగ్​ల్లో  బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పలువురు షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.  

ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంకేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పలువురు చేరుతున్నారన్నారు. 

స్టేడియంలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు.. 

జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి స్టేడియంను పరిశీలించారు.  ఈ సందర్భంగా షబ్బర్​అలీ మాట్లాడుతూ క్రీడకారులకు అవసరమైన ట్రాక్,  డ్రైనేజీ, గ్యాలరీ నిర్మిస్తున్నామన్నారు. పనులు త్వరిత గతిన చేపట్టాలన్నారు.  గత ప్రభుత్వాలు క్రీడలను విస్మరించాయన్నారు. 

యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్పోర్ట్స్​​యూనివర్సిటీని ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్​రెడ్డి,   డీసీసీ మాజీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ రావు, టౌన్, రూరల్ పార్టీ ప్రెసిడెంట్లు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్​రెడ్డి,  నాయకులు ఉత్తునూరు రవిపాటిల్,  శ్రీనివాస్, షేర్, అన్వర్, సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.