కేంద్రం 24 పైసలు కూడా ఇయ్యట్లేదని స్పీచ్‌లో ఆరోపణ

కేంద్రం 24 పైసలు కూడా ఇయ్యట్లేదని స్పీచ్‌లో ఆరోపణ
  •      తర్వాత స్పెషల్ గ్రాంట్ కింద రూ.25,555 కోట్లు ఇస్తదని గణాంకాల్లో వెల్లడి
  •     గతేడాది కూడా ఇట్లనే చెప్పుకొచ్చిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వటం లేదు’’ అంటూ బడ్జెట్ స్పీచ్‌లో కేంద్రంపై విరుచుకుపడిన రాష్ట్ర ప్రభుత్వం.. పైసల లెక్కల్లో మాత్రం మాట మార్చేసింది. తమకు వచ్చే ఆదాయంలో అతి పెద్ద వాటా కేంద్రానిదేనని.. కేంద్ర ప్రభుత్వమే తమకు పెద్ద దిక్కు అన్నట్లుగా చూపించింది. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో దాదాపు రూ.59 వేల కోట్లు కేంద్రం నుంచే వస్తాయని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా (డెవల్యూషన్​) కింద రూ.18,394 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.41 వేల కోట్లు వస్తాయని ప్రస్తావించింది.

హైదరాబాద్‌, వెలుగు: అప్పు చేయకుండా సాగునీటి ప్రాజెక్టుల నీళ్లు పారే పరిస్థితి కనిపించడం లేదు. రూ.22,675 కోట్లతో భారీ పద్దు బడ్జెట్‌లో పెట్టినా అందులో ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేస్తామంటున్నది రూ.9,277.16 కోట్లే. మిగతా రూ.13,398 కోట్లు లోన్‌ల రీపేమెంట్‌లు, కరెంట్‌ బిల్లులు, శాఖ నిర్వహణకే ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి కొత్తగా ఇంకో రూ.9 వేల కోట్ల అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కాగా కొద్ది మొత్తం కేటాయింపుతోనే సరిపెట్టారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టు గురించి బడ్జెట్‌లో గొప్పగా చెప్పినా.. పూర్తి చేయాలంటే మాత్రం ఇంకా రూ.32 వేల కోట్లకుపైగా ఖర్చు చేయాలి. నిరుటితో పోల్చితే కొద్దిగా కేటాయింపులు పెరిగినా కొన్ని ప్రాజెక్టులకు ఉన్న పెండింగ్‌ బిల్లులకన్నా తక్కువగానే కేటాయింపులు చేశారు.

రూ.22,675 కోట్ల ఇరిగేషన్‌ పద్దులో మేజర్‌, మీడియం ఇరిగేషన్‌కు రూ.21,401.08 కోట్లు, మైనర్‌ ఇరిగేషన్‌కు రూ.1,245.30 కోట్లు, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌కు రూ.18.69 కోట్లు, ఫ్లడ్‌ కంట్రోల్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దులో ప్రతిపాదించిన రూ.14,900 కోట్లల్లో రూ.9 వేల కోట్ల వరకు లోన్‌ల రీపేమెంట్‌కు ఖర్చు చేయనున్నారు. రూ.5 వేల కోట్ల వరకు కరెంట్‌ బిల్లులు, ప్రాజెక్టుల నిర్వహణకు వెచ్చిస్తారు. నిరుడు బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.16,931 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.17,331 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అప్పుల ద్వారా వెచ్చించిన మొత్తమే ఎక్కువ. రాష్ట్రంలో మూడో అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్తున్న సీతారామ పూర్తి చేయడానికి లోన్‌లపై ఆధారపడాల్సిందే. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన లిఫ్టులు, ఇతర పథకాలకు సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్‌లు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప నిధులు ఇవ్వడానికి సర్కారుకు చేతులు రాలేదు. బడ్జెట్‌లో పెట్టిన కొద్ది మొత్తం దాని కరెంట్‌ బిల్లులకు సరిపోని పరిస్థితి.ట్ సైజ్ పెంచుకునేందుకేనా ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో ఉన్న లెక్కల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణకు దాదాపు రూ.36 వేల కోట్లు వచ్చే అవకాశముంది. పన్నుల వాటాతోపాటు 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఇతర గ్రాంట్లన్నీ ఇందులోనే ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భూతద్దంలో చూపటం విస్మయానికి గురి చేస్తోంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.25,555 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్ ఇస్తుందంటూ బడ్జెట్ రాబడుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ కేంద్రం తమకు 24 పైసలు కూడా ఇవ్వటం లేదని బడ్జెట్ స్పీచ్‌లో ఆరోపించింది. ఇదికాక సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) లెక్కల్లో వచ్చిన తేడాను భర్తీ చేసేందుకు కేంద్రం రూ.3 వేల కోట్లు ఇస్తుందని రాష్ట్రం లెక్కలేసుకుంటోంది. ఇది నాలుగేళ్లుగా నలుగుతున్న టాపిక్. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం సీఎస్టీ పరిహారం ఊసే ఎత్తటం లేదు. అసలు రావనుకుంటున్న ఈ నిధులు.. ఇప్పుడు వస్తాయనుకొని రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన తీరు చర్చకు తెరలేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహాల్లో విహరిస్తున్నట్లుగా సంకేతాలిచ్చింది. బడ్జెట్ సైజ్‌ను పెంచుకునేందుకు ఉత్తుత్తిగానే కేంద్రం పేరుతో గ్రాంట్లను ఇబ్బడి ముబ్బడిగా కలబోసిందనే విమర్శలకు చాన్స్ ఇచ్చింది.

అప్పుడూ అంతే!
2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం నుంచి రూ.52 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో   అంచనాలు వేసుకుంది. అందులో సగం నిధులు కూడా రాలేదు. ఇప్పుడు రావని ముందే తెలిసినప్పటికీ.. కేంద్రం పద్దులో భారీగా ఆదాయం చూపించింది. బడ్జెట్ స్పీచ్‌లో ఒక తీరుగా.. బడ్జెట్ గణాంకాల్లో మరో తీరుగా వ్యవహరించడం సర్కారు ‘డబుల్ స్టాండ్’కు నిదర్శనం అని విమర్శలు వస్తున్నాయి.