ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇంటా బయట తేడా లేకుండా ఎక్కడైనా ఫోన్ కాల క్షేపం అయిపోయింది. అయితే సెల్ ఫోన్ వాడేటప్పుడు కొన్ని మర్యాదలు పాటించాలి. లేకపోతే అవతలి వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా కార్యాలయాలలో పనిచేసే వాళ్లు కొన్ని మర్యాదలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
- ముఖ్యమైనా మీటింగ్ ల్లో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయితే వెంటనే "ఎక్స్యూజ్ మీ" అంటూ ఫోన్ అక్కడే మాట్లాడుతుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇంపార్టెంట్ కాల్ అయితే పక్కకు వెళ్లి మాట్లాడాలి. లేదంటే మళ్లీ చేస్తానని కట్ చేయాలి.
- పక్కవాళ్లతో మాట్లాడుతూనే సెల్ ఫోన్ లో మెసేజ్ లు పంపటం మంచి అలవాటు కాదు. చాటింగ్ చేయటం వల్ల ఎదుటివాళ్లు
- చెప్పేది సరిగా వినలేరు. మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా మెసేజ్ లు , చాటింగ్ లు చేయడం మానేయాలి.
- కొందరికి పెద్దగా మాట్లాడే అలవాటు ఉంటుంది. కానీ ఆఫీసులో అలా మాట్లాడటం మర్యాద కాదు. ఫోన్ రాగానే దూరంగా వెళ్లి మాట్లాడాలి. లేదా చాలా చిన్న గొంతుతో మట్లాడాలి. హియర్ ఫోన్ వాడటం ఉత్తమం.
- చాలామంది మొబైల్ రింగ్ టోన్స్ గా పాటలు పెట్టుకుంటుంటారు. కొందరు ఇష్టమైన వాళ్ల మాటలు ఉంచుకుంటారు. కొన్ని రింగ్ టోన్స్ వినాలంటే పక్కవాళ్లకు విసుగు పుడుతుంది. ఫోన్ ఎప్పుడై నా, ఎక్కడైనా మోగొచ్చు కాబట్టి, వీలైనంత వరకు రింగ్ టోన్స్ ఫోన్ కంపెనీ వాళ్లు ఇచ్చినవి వాడితే బావుంటుంది. అందరి ఇష్టాలు ఒకేలా ఉండవన్న సంగతి మర్చిపోకూడదు.
- ప్రభుత్వ ఆఫీసైనా, ప్రైవేటు ఆఫీసైనా ఫోన్ రింగ్ టోన్ పెద్దగా మోగితే తోటి ఉద్యోగులు డిస్ట్రబ్ అవుతారు. కాబట్టి ఫోన్ ను వైబ్రేషన్ లో లేదా చిన్న సౌండ్ లో ఉంచాలి.
►ALSO READ | Good Health : జీవిత భాగస్వామితో గొడవపడితే షుగర్ వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త..!
వెలుగు, లైఫ్
