Good Health : జీవిత భాగస్వామితో గొడవపడితే షుగర్ వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త..!

Good Health :  జీవిత భాగస్వామితో గొడవపడితే షుగర్ వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త..!

ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. ఆఫీసుల్లో పెరిగిన పని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్లు, విపరీతమైన ప్రయాణాలు..  జీవిత భాగస్వామితో గొడవపడటం లాంటి కారణాల వల్ల ఇప్పటికే చాలామందికి చిన్నవయసులోనే షుగర్ వస్తోంది. 

మధుమేహం రావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మరో కొత్త విషయాన్ని చెప్పింది. అదేంటంటే.. తరచూ జీవిత భాగస్వామితో గొడవపడేవారికి ఈ వ్యాధి త్వరగా వస్తుందట! అంతేకాదు. అర్థరైటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని పరిశో ధకులు చెబుతున్నారు. 

ఆర్థరైటిస్, షుగర్ సమస్యలున్న వ్యక్తుల మీద జరిపిన ఇటీవల శాస్త్రవేత్తలు పరి శోధనలు జరిపారు. వీరిలో జీవిత -భాగస్వామితో తగాదాలు పడ్డవాళ్లలో అదే రోజున ఆరోగ్య సమస్య లు పెరిగినట్టు వారంతా గుర్తించారు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేయడంతో పాటు జీవిత భాగస్వామితో కూడా సరిగా ఉంటే ఆరో గ్యానికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

వెలుగు,లైఫ్​