ToxicTheMovie: యశ్ ‘టాక్సిక్‌‌’ నిర్మాణంలో సమస్యలు, విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ

ToxicTheMovie: యశ్ ‘టాక్సిక్‌‌’ నిర్మాణంలో సమస్యలు, విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ

‘కేజీయఫ్‌‌’ ఫ్రాంచైజీతో పాన్‌‌ ఇండియా స్టార్‌‌‌‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్.. ప్రస్తుతం ‘టాక్సిక్‌‌’ చిత్రంలో నటిస్తున్నాడు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుంది. KVN ప్రొడక్షన్స్‌‌ నిర్మిస్తున్న ఈ మూవీకి యశ్‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే, టాక్సిక్‌‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే, ఇపుడు ఈ మూవీ నిర్మాణంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో విడుదల వాయిదా పడినట్లు రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్గా రిలీజ్ డేట్పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

సినిమా రిలీజ్ డేట్‌‌లో ఎలాంటి మార్పు లేద‌‌ని తాము ప్రక‌‌టించిన‌‌ట్లే.. 2026 మార్చి 19న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు కన్‌‌ఫర్మ్ చేస్తూ.. రిలీజ్‌‌కు ఇంకా 140 రోజులు మాత్రమే ఉన్నాయని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుందని, పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలియజేశారు. జనవరి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు. ఉగాది, ఈద్ పండుగలు తమ సినిమాకు కలిసొస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ మూవీ గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ చుట్టూ నడిచే, యాక్షన్-ప్యాక్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. 1950ల నుంచి 1970ల మధ్య కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ రిలీజ్ చేసిన పోస్టర్స్, విజువల్స్లో కనిపిస్తున్నాయి. 

ఇందులో నయనతార, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతైరా హీరోయిన్స్‌‌గా నటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. కానీ ఇప్పటివరకు హీరోయిన్స్‌‌ గురించి ఎలాంటి ప్రకటన టీమ్ నుంచి రాలేదు. కన్నడ, ఇంగ్లీష్‌‌ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈమూవీపై ఇప్పటికే  అంచనాలు ఏర్పడ్డాయి. హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌ జేజే పెర్రీ ఈ సినిమాకు యాక్షన్‌‌‌‌ సీన్స్ కంపోజ్ చేస్తున్నాడు. హాలీవుడ్ యాక్షన్‌‌‌‌ మూవీస్‌‌‌‌ అయిన జాన్‌‌‌‌ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌‌‌‌ చిత్రాలతో పాటు అవతార్ 2, జెమిని మ్యాన్, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్స్‌‌‌‌ 5 చిత్రాలకు జేజే పెర్రీ వర్క్ చేశాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.