 
                                    యాదాద్రి భువనగిరి: అవినీతి, లంచం కేసులో ఏసీబీకి చిక్కిన యాదగిరి గుట్ట ఎలక్ట్రికల్ఈఈ రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ శుక్రవారం(అక్టోబర్31) ఆలయ ఇంఛార్జ్ ఈవో హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు.
తంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలకు పాల్పడినందుకు 2024 ఆగస్టులో కూడా సస్పెండ్ అయ్యారు రామారావు. సస్పెన్షన్ కు గురై తిరిగి విధుల్లో చేరిన ఆరునెలల్లో నే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో రామారావుపై సస్పెన్షన్ వేటు వేశారు ఆలయ ఇంఛార్జ్ ఈవో.
ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు సస్పెండ్ అయిన ఈఈ రామారావు తొలగించి ఆయన ప్లేస్ లో ఎలక్ట్రికల్ ఈఈగా పనిచేస్తున్న దయాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఇంఛార్జ్ ఈవో హరీష్.

 
         
                     
                     
                    