నేవీ కొత్త దళపతిగా కరంబీర్ సింగ్

నేవీ కొత్త దళపతిగా కరంబీర్ సింగ్

నేవీ కొత్త దళపతిగా కరంబీర్ సింగ్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకుగాను ఉత్వర్వులు జారీ చేసింది. వీరు మే31వ తారీఖున పదవీ బాధ్యతలను తీసుకోనున్నారు. ప్రస్తుతం కరంబీర్ వైజాగ్ లోని ఈస్ట్రన్ నావెల్ కమాండ్ కు ఫ్లాగ్ ఆఫీసర్ గా ఉన్నారు. 1980 జులైలో కరంబీర్ నేవీలో భాగమయ్యారు. 39ఏళ్ల సర్వీసులో.. ఇండియ‌న్ కోస్టు గార్డ్ షిప్‌, నావెల్ మిస్సైల్ కోర్వ‌ర్టి, గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్స్‌కు క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఉన్న నేవీ చీఫ్ సునీల్ స్థానంలో కరంబీర్ బాధ్యతలు తీసుకోనున్నారు.