అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు :- అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇస్లాం నగర్ కు చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. త్వరలోనే ఇస్లాంనగర్ లో కల్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కాశ శ్రీనివాస్, నీలం గురువయ్య, సల్మాన్ రెడ్డి, రాగిరి నాగరాజు, చిలువేరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

అర్హులందికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

వేములవాడరూరల్, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల గ్రామంలో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకోగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన వస్త్రాలు పెట్టారు. 

మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్, కాంగ్రెస్​రూరల్ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.