V6 News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

వంగూర్, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం రంగాపూర్ సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ లాంటి పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.