ఈ నెంబర్‌తో కాల్స్ వస్తే జాగ్రత్త.. గవర్నమెంట్ అలర్ట్

ఈ నెంబర్‌తో కాల్స్ వస్తే జాగ్రత్త.. గవర్నమెంట్ అలర్ట్

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆన్ లైన్ లో కొత్త తరహాలో సైబర్ నేరాల గురించి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అయితే టెలిమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము. మీరు ఈ నెంబర్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కు ఉపయోగిస్తున్నారు. మీ మీద  యాక్షన్ తీసుకుంటామంటూ సైబర్ నేరగాళ్లు కాల్స్ చేసి బెదిరిస్తున్నారట. ప్రభుత్వ అధికారులమంటూ పర్పనల్ ఇన్ఫర్మేషన్ చెప్పమని బెదిరిస్తున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్  (DoT) గుర్తించింది.

ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారికి మీ వ్యక్తిగత సమాచారం చెప్పవద్దని DoT సూచించింది. వాట్సాప్ లేదా నార్మల్ కాల్స్ లో +92తో వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేయవద్దు. ఆ నెంబర్లు విదేశీ సైబర్ నేరగాళ్లు నుంచి వస్తున్నాయని టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులు హైచ్చరిస్తున్నారు. కాల్ చేసి మీ నెంబర్ ని మిస్ యూస్ చేస్తున్నారని పర్సనల్ డిటేల్స్ అడుగుతున్నారట.. వాటితో బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు మాయం చేస్తున్నారని DoT తెలిపింది.

ఇండియన్ ఫోన్ నెంబర్స్ కు  ముందు +91 ఉంటుంది. వేరే దేశాలను నుంచి కాల్స్ వస్తే ఆ నెంబర్ మారుతుంది. ఒక్కో దేశానికి ఒక్కో నెంబర్ కేటాయింస్తారు. మీ నెంబర్ స్టేటస్ తెలుసుకోవడానికి సంచార్ సాథి గవర్నమెంట్ సైట్ లో తెలుసుకోవచ్చని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు వివరించారు. సైబర్ క్రైమ్ కు గురైనా, ఇలా మీ నెంబర్స్ కు +91 కాకుండా వేరే నెంబర్స్ తో కాకుండా వేరే నెంబర్ ఉన్న కాల్స్ చేసి బెదిరించినా 1920 లేదా https://cybercrime.gov.in/లో కంప్లెయింట్ చేయాలని DoT  కోరింది. స్పామ్ కాల్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇన్ స్టంట్ మేనేజింగ్ యాప్ లు ఉన్నాయి. ఇవి మీరు సేవ్ చేసుకోని నెంబర్స్ ఫోన్ కాల్ రింగ్ అవ్వ కుండా చూస్తాయి. మీకు అనుమానం ఉన్న నెంబర్ ను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది.