దేశంలో ఒకే ఛార్జింగ్ పోర్ట్ తీసుకురావాలని ప్రభుత్వ ఆదేశం

దేశంలో ఒకే ఛార్జింగ్ పోర్ట్ తీసుకురావాలని ప్రభుత్వ ఆదేశం

గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో ఒకేరకమైన ఛార్జింగ్ పోర్టు్ ఉండాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీన్ని కొన్ని దేశాలు ఇప్పటికే ఆమోదించాయి కూడా. అయితే, భారత వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా తాజాగా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి, రూల్ పాస్ చేసింది. 

బుధవారం రోజు కొన్ని ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కొన్ని ప్రసిద్ధ విద్యా సంస్థల ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రతినిధుల సమావేశం జరిగింది. అందులో దేశంలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ (టైప్ సి పోర్ట్) తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ఆయా పరిశ్రమల ప్రతినిధులు కూడా అంగీకరించారు. ఒకే ఛార్జింగ్ పోర్ట్ తో ఈ-వేస్ట్‌జ్ తగ్గుతుందని చెప్తున్నారు. అయితే, రాబోయే సంవత్సరాల్లో యాపిల్ సహా అన్ని ఫోన్లలో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ లే ఉండనున్నాయి. మొబైల్ ఫోన్స్ లో వీటి ఆమోదం దశల వారిగా జరుగుతుంది.