ప్రతిష్ట పెంచుకోవడమే ముఖ్యమా?.. కేంద్రంపై ప్రముఖ నటుడి విమర్శలు

ప్రతిష్ట పెంచుకోవడమే ముఖ్యమా?.. కేంద్రంపై ప్రముఖ నటుడి విమర్శలు

ముంబై: కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా నిలిచే బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈసారి విమర్శలకు దిగారు. మోడీ సర్కార్ తన ప్రతిష్టను పెంచుకోవడం మీదే కాకుండా మిగిలిన అంశాల పైనా శ్రద్ధ పెట్టాలని చురకలు అంటించారు. 'ప్రభుత్వం ఎల్లప్పుడూ జవాబుదారీతనంతో మెలగాలి. జీవితంలో ప్రతిష్టను పెంచుకోవడానికి మించిన అంశాలు మరెన్నో ఉన్నాయనీ కేంద్రం గ్రహించాలి' అని అనుపమ్ సూచించారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి మీద కరుణ చూపాలన్నారు. శవాలు నీటిలో తేలుతుండటాన్ని చూసి చలించని వారికి మానవత్వం లేనట్లేనని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై రాజకీయాలు తగవని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో ఎక్కడో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా తేరుకొని వైరస్ కట్టడి చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అనుపమ్ సతీమణి కిరణ్ ఖేర్ బీజేపీ ఎంపీగా ఉండటం గమనార్హం.