
ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని గవర్నమెంట్ పెన్షనర్స్ అసొసియేషన్ తెలంగాణ ప్రకటించింది. గురువారం అంబర్పేట తిలక్ నగర్ లోని అసోసియేషన్ ఆఫీసులో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్రబాబు, ఎం.వి.నర్సింగరావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సంఘం కాంగ్రెస్ కు అండగా నిలిచిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలదొక్కుకొని సుస్థిర పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్అభ్యర్థి తీన్మార్ మలన్న గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.