చింతలమానేపల్లి మండలంలో టీచర్లు లేక సర్కార్ బడి బంద్

చింతలమానేపల్లి మండలంలో టీచర్లు లేక సర్కార్ బడి బంద్

కాగజ్ నగర్, వెలుగు: టీచర్లు లేక చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ 2 ( బెంగాలీ క్యాంప్) లోని సర్కార్ బడి బంద్ అయ్యింది. గత విద్యా సంవత్సరం వరకు స్కూల్​లో ఓ టీచర్​బోధించేవారు. బదిలీల్లో భాగంగా ఆయనను ట్రాన్స్​ఫర్ చేసి మరో టీచర్​ను కేటాయించలేదు. దీంతో ఈ విద్య సంవత్సరం టీచర్లు లేకపోవడంతో తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు.

ఫీజుల భారం మోస్తున్నారు. టీచర్లను కేటాయించి స్కూల్​ను తెరవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంఈవో జయరాజ్​ను సంప్రదించగా.. టీచ ర్లకు కేటాయించకపోవడంతో స్టూడెంట్స్ రావడంలేదని, అందుకే బడిని మూసి ఉంచామని తెలిపారు.