నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ జిల్లాలో తడిసిన ధాన్యానికి మద్దతు ధర : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ జిల్లాలో తడిసిన ధాన్యానికి మద్దతు ధర :  కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్​ కర్నూల్/కందనూలు, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 35 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని, దిగుబడి అంచనాలకు మించి రావడంతో ఎదురవుతున్న రవాణా, నిల్వ సమస్యలను అధిగమించేందుకు జిన్నింగ్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లను వినియోగిస్తున్నామని తెలిపారు. 

అనంతరం బిజినేపల్లి మండలంలో ఆయన పర్యటించారు. పాలెంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కానుగల కుంట చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పూడికతీత పనులను పరిశీలించారు. చెరువుల పూడికతీత వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, పనుల వద్ద కూలీలకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు.