అన్నం పెట్టిన కరీంనగర్‌‌‌‌ ప్రజలకు ద్రోహం చేసిండు : అడ్లూరి లక్ష్మణ్

అన్నం పెట్టిన కరీంనగర్‌‌‌‌ ప్రజలకు ద్రోహం చేసిండు : అడ్లూరి లక్ష్మణ్
  •     కేసీఆర్‌‌‌‌పై ప్రభుత్వ విప్‌‌ అడ్లూరి లక్ష్మణ్  ఫైర్

హైదరాబాద్‌‌, వెలుగు :  బీఆర్‌‌‌‌ఎస్ పార్టీకి అన్నం పెట్టిన కరీంనగర్ జిల్లా ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేసిండని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌‌ అడ్లూరి లక్ష్మణ్‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. తన నియోజకవర్గం ధర్మపురిలో ఉన్న మేడారం రిజర్వాయర్‌‌‌‌, మిడ్‌‌ మానేరు నుంచి గజ్వేల్‌‌, సిద్దిపేటకు నీళ్లు తరలించుకుపోయిన కేసీఆర్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌కు ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద సాగర్, వరద కాల్వ ద్వారా నీళ్లొస్తున్నయి తప్పితే

కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి కాదని వివరించారు. కాళేశ్వరం లింకు 2 పేరిట సుమారు 1700 ఎకరాల భూములను, పోలీసు పహారా పెట్టి రైతుల నుంచి గుంజుకున్నారని, తన మీద 13 కేసులు పెట్టించారని తెలిపారు. జీవన్‌‌ రెడ్డి మీద కేసులు బనాయించారని లక్ష్మణ్‌‌ కుమార్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాకు బీఆర్‌‌‌‌ఎస్ చేసిన అన్యాయంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పారు.