
- ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులు మంజూరు చేయిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఐదేండ్లుగా ఈ పథకం నిధులు రాకున్నా.. ఏటా150 మంది నిరుపేద గిరిజన విద్యార్థులకు విద్యతోపాటు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్న యాదగిరిగుట్ట ఎస్వీఎన్ రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. శుక్రవారం ఈ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరయ్యారు.
స్కూల్ స్టాఫ్, మహిళా పోలీసులు, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. బీర్ల ఫౌండేషన్ తరఫున స్కూల్ లో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, టౌన్అధ్యక్షుడు భిక్షపతి, సీఐ భాస్కర్, ఎస్వీఎన్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, చైర్మన్ బాలరాజు గౌడ్, వైస్ చైర్మన్ మల్లేశం గౌడ్, డైరెక్టర్లు పాల్గొన్నారు.