
సీఎం సందేశం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
గవర్నర్ సందేశం
ప్రజలందరికీ హొలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ నరసింహన్. రసాయనాలతో కూడిన కలర్స్ ను ఉపయోగించవద్దని కోరారు గవర్నర్.
రాజ్ భవన్ లో హోలీ వేడుకలు రద్దు
రాజ్ భన్ లో ఏటా హోలీ వేడుకలు సంప్రదాయబద్దంగా సంబురంగా జరుగుతుంటాయి. గవర్నర్ దంపతులు అధికారులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటుంటారు. ఐతే.. ఈసారి వేడుకలు రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాది ఘటన కారణంగా.. ఈ రోజు హొలీ కార్యక్రమాలను రద్దు చేసినట్టు రాజ్ భవన్ ప్రకటించింది.