
రాజ్ భవన్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గవర్నర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ రాజ్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు గవర్నర్ 10ఏళ్ళ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు పారదర్శక పాలన అందించడంతో పాటు అవినీతిని వ్యతిరేకించడమే మన లక్ష్యమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. ఆయన ప్రసంగం అనంతరం గవర్నర్ జై తెలంగాణ, జై భారత్ అని నినాదం చేశారు.