ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కుటుంబానికి గవర్నర్ ఆర్థికసాయం

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కుటుంబానికి గవర్నర్ ఆర్థికసాయం

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై సూచించారు. గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సంజయ్ కిరణ్ కుటుంబాన్ని ఆమె పరామార్శించి.. 2 లక్షల ఆర్థికసాయం చేశారు. ట్రిపుల్ ఐటీకి వెళ్ళినప్పుడు సంజయ్ కిరణ్ ది నిరుపేద కుటుంబం అని తెలుసుకుని బాధపడిపట్లు తెలిపారు. అతని సోదరుడు ఉదయ్ కిరణ్ ధైర్యంతో ఉండి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. 

స్టూడెంట్స్ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని.. ఛాలెంజెస్ను ఫేస్ చేయాలని గవర్నర్ సూచించారు. కరోనా తరువాత చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారని.. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని.. మెడికల్ సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పారు. కాగా తన ప్రోటోకాల్ పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.