స్టూడెంట్ల ఆత్మహత్యలపై ​వీసీలు, రిజిస్ట్రార్లు ఆలోచించాలి : తమిళి సై

స్టూడెంట్ల ఆత్మహత్యలపై ​వీసీలు, రిజిస్ట్రార్లు ఆలోచించాలి : తమిళి సై

స్టూడెంట్ల ఆత్మహత్యలపై ​వీసీలు, రిజిస్ట్రార్లు ఆలోచించాలి

వాళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి: తమిళి సై

హైదరాబాద్, వెలుగు : యూనివర్సిటీల్లో స్టూడెంట్ల ఆత్మహత్యలపై ఆలోచించాలని, వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారో గుర్తించాలని వీసీలు, రిజిస్ర్టార్లకు గవర్నర్  తమిళిసై సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు మనోధైర్యం కూడా కల్పించాలన్నారు. సోమవారం రాజ్ భవన్ లో యూనివర్సిటీల వీసీలు, రిజిస్ర్టార్లతో గవర్నర్  సోమవారం రివ్యూ నిర్వహించారు. వర్సిటీల్లో విద్యార్థుల సమస్యలు, ఇబ్బందులపై ఆమె ఆరా తీశారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా గర్ల్  స్టూడెంట్లకు టాయిలెట్స్  ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వర్సిటీల్లో అమలు చేస్తున్న ప్లాన్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు  సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె తెలిపారు. వీసీలకు లిమిటేషన్స్ ఉన్నప్పటికీ స్టూడెంట్ల సమస్యలు తీర్చాలన్నారు. “మన దగ్గర మంచి ప్రొఫెసర్లు ఉన్నారు. టాలెంటెడ్  స్టూడెంట్స్ ఉన్నారు. కానీ, ర్యాంకింగ్స్ లో మనం ఎందుకు వెనుకపడుతున్నామో ఫోకస్  చేయాలి. ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాలి. మంచి విద్యతోనే రాష్ట్రం డెవలప్   అవుతుంది. విద్యార్థులను జాబ్  సీకర్స్ (ఉద్యోగార్థులు) గా కాకుండా జాబ్  క్రియేటర్స్ గా తీర్చిదిద్దాలి. పూర్వ విద్యార్థులతో అల్యూమ్నీలు పెట్టి వాళ్ల సేవలు  వాడుకోవాలి” అని గవర్నర్  సూచించారు. కాగా, ఐఐటీ జేఈఈ, నీట్, సీఎస్ఈ, మెడికల్, హెల్త్ కేర్, యూపీఎస్సీ, ఆర్ఆర్ బీ పరీక్షలకు సంబంధించి బుక్స్ అందుబాటులో ఉండేలా డిజిటల్ లైబ్రరీని గవర్నర్  ప్రారంభించారు. 

పలువురు వీసీలు డుమ్మా

తాను విదేశీ పర్యటనలో ఉన్నందున కాకతీయ వీసీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే జేఎన్టీయూ, ఓయూ, తెలంగాణ వర్సిటీ అధికారులు కూడా గైర్హాజరయ్యారు. పలువురు వీసీలు తాము అటెండ్  కాకుండా వర్సిటీల తరపున రిజిస్ర్టార్లను పంపించారు. అయితే ఈ మీటింగ్ పై ఉన్నత విద్యా మండలికి సమాచారం లేదని అధికారులు అంటున్నారు.

ALSO READ:ప్రిగోజిన్.. జాగ్రత్త! వాగర్న్ చీఫ్ కు సీఐఏ మాజీ చీఫ్ హెచ్చరిక

చాలా వర్సిటీలకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నా

కామన్  రిక్రూట్ మెంట్ బిల్లు గురించి యూజీసీ, ఇతర వర్సిటీలు, విద్యా నిపుణులతో చర్చించానని గవర్నర్   తమిళిసై తెలిపారు. బిల్లుకు ఆమోదం తెలపకుండా బిల్లుపై తన అభ్యంతరాలను పేర్కొంటూ రాష్ర్టపతి పరిశీలన కోసం పంపానని చెప్పారు. రాష్ర్టంలో చాలా వర్సిటీలకు వెళ్లి అక్కడి విద్యార్థుల సమస్యలు, సౌలతులు అడిగి తెలుసుకున్నానని వివరించారు.