కూకట్ పల్లి జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్

కూకట్ పల్లి జేఎన్టీయూలో మెగా జాబ్  ఫెయిర్

జవహర్ లాల్ నెహ్రూ ఆడిటోరియంలో మెగా జాబ్ ఫెయిర్ ను ప్రారంభించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. JNTU సహకారంతో నిపుణ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ జాబ్ ఫెయిర్ జరుగుతోంది. JNTU గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ లో భాగంగా  మెగా జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు.  జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ . 145 కు పైగా కంపెనీలు పార్టీస్ పేట్ చేయడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నించడం కాకుండా వారి వారి సబ్జెక్ట్ లో నెపుణ్యం పెంచుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, రోబోటిక్, మెడిసిన్, ఫార్మా రంగంలో కొత్త పోకడలకు అనుగుణంగా ఉద్యోగాలు వస్తున్నాయని...యంగ్ స్టార్స్ వాటి పైన దృష్టి పెట్టాలని సూచించారు.  సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి రంగాలలో యువ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి సహకరిస్తుందన్నారు.