అర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం

అర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం

ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఎంపీ నివాసంపై దాడి చేసి ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటులేదన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబసభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తులు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ  దహనం చేశారు.