
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై ఇటీవలే నాలుగేండ్లు పూర్తి చేసుకున్నారు. అయితే, త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆమె తన సొంత రాష్ట్రం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ అంశంపైనే పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.